Mydukur Municipality: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్కంఠ రేపిన మైదుకూరు మున్సిపాలిటీను కూడా సొంతం చేసుకుంది. బలబలాలు సమానంగా ఉండటంతో ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నిక ( Ap Municipal Elections)ల్లో అధికార పార్టీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 75 మున్సిపాలిటీ, 12 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో ఏలూరు ఫలితం హైకోర్టు ఆదేశాలతో వెలువడలేదు. మిగిలిన 11 కార్పొరేషన్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక తాడిపత్రి, మైదుకూరు మున్సిపాలిటీల్లో హోరాహోరీ నెలకొంది. తాడిపత్రి మున్సిపాలిటీ (Tadipatri Municipality)ని తెలుగుదేశం కైవసం చేసుకోగా..ఉత్కంఠ రేపిన మైదుకూరుని మాత్రం అధికార పార్టీనే దక్కించుకుంది. 


కడప జిల్లాలోని మైదుకూరు మున్సిపాలిటీ(Mydukur Municipality)లో మొత్తం 24 వార్డులుండగా తెలుగుదేశం పార్టీ 12 గెల్చుకోగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr congress party) 11 వార్డుల్లో విజయం సాధించింది. జనసేన ఒక స్థానంలో గెలిచింది. దీంతో ఏ పార్టీకు మెజార్టీ రాని పరిస్థితి నెలకొంది. ఇద్దరు ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి వైసీపీ బలం 13 కు చేరింది. ఇక టీడీపీ, జనసేన కలిస్తే ఆ పార్టీ సంఖ్యాబలం కూడా 13కు చేరుకుంది. అయితే కౌన్సిల్ ఎన్నిక సమయంలో టీడీపీ సభ్యురాలు మహబూబ్‌బీతో పాటు జనసేన సభ్యుడు బాబు గైర్హాజరయ్యారు. దాంతో టీడీపీ బలం 11కు పడిపోయింది. ఫలితంగా మైదుకూరు ఫీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌గా మాచనూరి చంద్ర, వైస్ ఛైర్మన్‌గా మహబూబ్ షరీఫ్ ఎన్నికయ్యారు. 


Also read: Amaravati land scam: సీఐడీ అధికారుల ముందు హాజరైన ఎమ్మెల్యే ఆర్కే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook