ఇక ఉచితంగా `వైఎస్ఆర్ కంటి వెలుగు`
ఏపీ సర్కార్ ప్రతిష్ట్మాతకంగా చేపట్టనున్న `వైఎస్సార్ కంటి వెలుగు` కార్యక్రమాన్ని గురువారం 10వ తేదీన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.
అమరావతి: ఏపీ సర్కార్ ప్రతిష్ట్మాతకంగా చేపట్టనున్న 'వైఎస్సార్ కంటి వెలుగు' కార్యక్రమాన్ని గురువారం 10వ తేదీన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతపురం జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభ ద్వారా సీఎం వైఎస్ జగన్ ఈ ప్రత్యేక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు అందించనున్నట్టు ఇదివరకే సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
సంవత్సరానికి రెండు విడతలు చొప్పున మూడేళ్లపాటు మొత్తం 6 విడతల్లో రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు, అవసరమైన వారికి శస్త్రపరీక్షలు అందనున్నాయి.