YSRCP Leaders comments on Ap valunteers job system: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చారు. గత ఎన్నికలలో వైసీపీకి 151 స్థానాలు కట్టబెట్టిన ఏపీ ప్రజలు ఈసారి కనీసం అపోసిషన్ హోదా కూడా ఇవ్వకుండా కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యేలా చేశారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ లకు భారీ మెజార్టీని కట్టబెట్టారు. అంతేకాకుండా.. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి కూడా టీడీపీ కీలక పాత్ర పోషించే స్థానానికి ఎదిగిందని చెప్పుకొవచ్చు.  గతంలో చంద్రబాబుకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వని బీజేపీ నేతలు ఇప్పుడు..ఏకంగా చంద్రబాబుకు మోదీ పక్కన సీటును ఏర్పాటు చేయాల్సి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more:Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..


ఈ ఎన్నికలో ప్రజలు ఇటు కేంద్రంలోని బీజేపీతో పాటు ఇరు తెలుగు స్టేట్స్ లలో కూడా ఊహించని ట్విస్ట్ లు ఇచ్చారు. వైసీపీ ప్రజల్లో వైనాట్ 175 అంటూ ఎన్నికల్లో వెళ్లింది. ఇక కేంద్రంలో బీజేపీ అబ్ కీ బార్ చారో సో పార్.. అంటూ ఎన్నికలో దిగారు. కానీ ప్రజలు మాత్రం ఎవరి ఊహించని విధంగా, ఎగ్జీట్ పోల్స్ అంచనాలు కూడా అందని విధంగా ఫలితాలను ఇచ్చారు.  ఇక ఏపీలో ప్రజలు వైసీపీకి ఇచ్చిన రిజల్ట్ మాత్రం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా  మారింది. దీనిపై ఇటీవల సీఎం జగన్ తన నివాసంలో ప్రత్యేకంగా వైసీపీ నాయకులు, మంత్రులతో సమావేశం నిర్వహించారు. అయితే.. ఇటీవల కొందరు వైసీపీ మంత్రులు, కీలక నేతలు ఏపీలో తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలు కొంత ఇబ్బంది కల్గించే అంశంగా మారిందని పలు వ్యాఖ్యలు చేశారు.


ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. వాలంటీర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలు తమ కొంప ముంచాయని అన్నారు.  వాలంటీర్ వ్యవస్థ వల్ల.. ప్రజలకు, నాయకులకు మధ్య గ్యాప్‌ ఏర్పడిందని అన్నారు. తమ ప్రభుత్వ ఫలాలు ప్రజలకు నేరుగా అందించడానికి వాలంటీర్లను ఏర్పాటు చేశామని అన్నారు. కానీ ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, గ్రౌండ్ లెవల్ నాయకులు కాస్త సముచిత స్థానం ఇవ్వలేదని నొచ్చుకున్నట్లు తెలిసిందన్నారు.


అదే విధంగా.. మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు కూడా.. వాలంటీర్ వ్యవస్థపై సంచలన కామెంట్లు చేశారు. వాలంటర్ ల వల్ల తమ ప్రభుత్వానికి, ప్రజలకు కొంత గ్యాప్ ఏర్పడిందన్నారు. కొన్ని చోట్ల వాలంటీర్లు ఇష్టారీతీన ప్రవర్తించినట్లు తమకు ఫిర్యాదు అందాయన్నారు. ఆయా నియోజక వర్గాల నేతలు, కార్యకర్తలు తమకు సరైన గౌరవం ఇవ్వలేదని బాధపడినట్లు తెలిసిందన్నారు. కేవలం ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏది కావలన్న వాలంటీర్లను అడగటం జరిగిందన్నారు. దీంతో స్థానిక నేతలను కొన్ని చోట్ల ప్రజలు పట్టించుకోలేని కారణంగా నొచ్చుకున్నట్లు తెలుస్తోందన్నారు. అందుకే వాలంటీర్ వ్యవస్థ కూడా తమ ప్రభుత్వం ఓడిపోవడానికి ఒక కారణంగా కూడా మాజీ మంత్రులు గుడివాడ అమర్ నాథ్, సీదిరి అప్పల రాజు చెప్పుకొచ్చారు.


మరోవైపు ఏపీలో ప్రస్తుతం ఉన్న వాలంటీర్ వ్యవస్థను కంటీన్యూ చేస్తారా..? లేదా అనేది ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో మాత్రం చంద్రబాబు.. వాలంటీర్ వ్యవస్థను కంటీన్యూ చేస్తానని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎన్నికల తర్వాత వాలంటీర్ల పై ఆ పార్టీ నేతలే ఇలాంటి వ్యాఖ్యలను చేయడం పట్ల చంద్రబాబు నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది.


Rear more: Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..


వాలంటీర్‌ వ్యవస్థ వల్ల.. రూరల్ డెవలప్ మెంట్, పంచాయతీరాజ్ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని కూడా కొందరు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ ఉద్యోగాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయంతీసుకుంటారో అనేది మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరికొందరు వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయోచ్చనే ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter