Perni Nani Counter: వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్ ఆస్థుల వివాదంపై తాజాగా వైసీపీ మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసురెడ్డి వ్యాఖ్యలు చేశారు. మధ్యలో మీకెందుకంటూ తగదనమ్మా అంటూ పేర్ని నాని బాలినేనికి గట్టి కౌంటర్ ఇచ్చారు. బాలినేని వ్యాఖ్యలపై వైసీపీ గట్టిగానే స్పందించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల ఆస్థుల కోసం గొడవ పడుతూ వైఎస్ ఇమేజ్‌కు నష్టం చేకూరుస్తున్నారని బాలినేని వ్యాఖ్యానించారు. ఇద్దరూ విజయమ్మ చెప్పినట్టుగా నడుచుకోవాలని సూచించారు. బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలకు వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. విజయమ్మ చెప్పినట్టు నడుచుకోవాలంటే జడ్జి స్థానంలో ఉన్నవారు నిష్పక్షపాతంగా ఉండాలి కదా అని చెప్పారు. అయినా వైసీపీ వద్దని వెళ్లిపోయిన వ్యక్తి ఇప్పుడు పెద్దమనిషి అవతారం ఎందుకు ఎత్తారని ప్రశ్నించారు పేర్నినాని. 


బాలినేని శ్రీనివాస్ రెడ్డి..రాజకీయాల కోసం ఏమైనా మాట్లాడుతారనని ఇప్పుడు జనసేన పార్టీలో ఉండటంతో ఆ పార్టీ లైన్ తీసుకుంంటున్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో చంద్రబాబుపై , కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడుడు 6 వేల కోట్ల భారం ప్రజలపై మోపేందుకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. సంపద సృష్టిస్తామని కబుర్లు చెప్పిన కూటమి ప్రభుత్వ నేతలు ఐదు నెలల్లోనే 47 వేల కోట్లు అప్పులు చేసిందన్నారు. 


తమ నాయకుడు జగన్ హయాంలో సృష్టించిన సంపదను ఇప్పుడు చంద్రబాబు తన మనుషులకు దోచిపెడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఉచిత ఇసుక పేరుతో హడావిడి తప్ప ఎక్కడా ఉచితంగా ఇసుక ఇస్తున్న పరిస్థితి లేదన్నారు. అంతేకాకుండా గతం కంటే ఎక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నారని మండిపడ్డారు.


Also read: New Pension Rule: పెన్షనర్లకు దీపావళి గిఫ్ట్, ఇక ప్రతి నెలా అదనపు పెన్షన్, కొత్త నిబంధనలివే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.