YSRCP Janagraha Deeksha : రేపటి నుంచి వైఎస్సార్సీపీ జనాగ్రహ దీక్షలు
YSRCP Janagraha Deeksha: రేపటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రపద్రేశ్ వ్యాప్తంగా ఈ జనాగ్రహ దీక్షలు కొనసాగుతాయన్నారు.
YSRCP leader Sajjala Ramakrishna Reddy says about YSRCP Janagraha Deeksha: రేపటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy ) పేర్కొన్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు నిరసనలు చేయనున్నట్లు సజ్జల తెలిపారు. టీడీపీ నేతల (TDP leaders) అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రపద్రేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా ఈ జనాగ్రహ దీక్షలు కొనసాగుతాయన్నారు. అనుచిత వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో ఈ జనాగ్రహ దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Also Read : Nara lokesh: పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు : లోకేశ్
ఇక వైసీపీ, టీడీపీ పోటా పోటీ ఆందోళనలతో ఏపీలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ (TDP) కార్యాలయాలపై దాడులకు నిరసనగా ఇవాళ టీడీపీ బంద్‌కు పిలుపునిస్తే.. టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ (YSRCP) శ్రేణులు ఏపీ అంతటా నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఇక టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) నిరసన దీక్ష చేపట్టనున్నారు. రేపు ఉదయం నుంచి 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష కొనసాగించాలని నిర్ణయించారు.
Also Read : Kodali Nani : వ్యూహం ప్రకారమే డ్రగ్స్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : కొడాలి నాని
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి