Vijayasai Reddy: విజయసాయి వల్లే నా భార్య ప్రెగ్నెంట్.. కేసు పెట్టిన లేడీ కమిషనర్ భర్త..
Andhra Pradesh: వైఎస్సార్సీపీ నేత విజయ సాయిరెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లిద్దరు తన భార్య ప్రెగ్నెంట్ కావడానికి కారణమంటూ కూడా లేడీ కమిషనర్ భర్త సంచలన ఆరోపణలు చేశాడు. ఈ ఘటన ఇప్పుడు ఏపీలో హట్ టాపిక్ గా మారింది.
Ysrcp leader vijayasaireddy extramarital affair with endowment woman employee: ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సీర్సీపీ ఇప్పటికే అధికారం కొల్పోయి ఇబ్బందులు పడుతుంది. మరోవైపు వాలంటీర్లు ఏపీ వ్యాప్తంగా అనేక చోట్ల నాయకులపై కేసులు పెడుతున్నారు. అదే విధంగా ఏపీలో అధికారంలో ఉండగా..వైసీపీ నేతలు చేసిన అక్రమాలను, కూటమి ప్రభుత్వం బైటకు తీస్తుంది. మరోవైపు వైసీపీ పార్టీ కార్యాలయాల అక్రమ నిర్మాణాలను కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. వైసీపీ నేతలు కబ్జాచేసిన భూములను తిరిగి,ప్రజలు స్వాధీనం చేసుకుంటున్నారు.
అదేవిధంగా వైసీపీ హయాంలో ప్రభుత్వం అండను చూసుకుని అడ్డదారులు తొక్కిన అధికారులను సైతం చంద్రబాబు చుక్కలుచూపిస్తున్నారు. ఇటీవల ఏపీ మాజీ సీఎంపై సైతం గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న వరుస షాకులతో కుదేలవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా, వైసీపీకి దిమ్మతిరిగే షాక్ లాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాలు..
వైఎస్సార్సీపీ నేత విజయ్ సాయిరెడ్డి చేసిన ఘన కార్యం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ శాంతితో ఆయన రాసలీలలు సాగించాడంట. ఇటీవల ఆయన భర్త.. మదన్ మోహన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. శాంతి భర్త , మదన్ మోహన్ విదేశాల్లో ఉంటున్నారు. కానీ.. శాంతి మాత్రం ఏపీలో దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమీషనర్ గా విధులు నిర్వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల గర్భం దాల్చింది. దీని మీద ఆమె భర్త చేసిన ఆరోపణలు మాత్రం పెనుదుమారంగా మారాయి. తాను.. కొన్ని నెలలుగా విదేశాలలో ఉన్నానని, తన భార్యగర్భం దాల్చడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా.. తన భార్యను వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లు లొంగదీసుకున్నారని తెల్చి చెప్పాడు.
తన భార్యను వేధించి విజయసాయిరెడ్డి లైంగికంగా వాడేసుకున్నాడని ఆమె భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శాంతి భర్త దేవాదాయశాఖ కమిషనర్ కు భర్త.. మదన్ మోహన్ ఫిర్యాదు చేశాడు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవదాయ శాఖ కమిషనరును కోరుతూ లేఖ రాశారు.
అదే విధంగా.. తనకి మేటర్ లేదని డాక్టర్ సర్టిఫికెట్ సృష్టించి తప్పించుకునే కుట్రలో విజయసాయిరెడ్డి నిమగ్నమయ్యారని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత సర్కారు హయాంలో అక్రమాలకు పాల్పడిన అనేక మంది అధికారులపై చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగానే.. ఇటీవలే శాంతిని దేవదాయశాఖ కమిషనర్ సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటన మాత్రం ఏపీలో సంచలనంగా మారింది. దీనిపై పూర్తి వివరాలు మాత్రం బైటకు రావాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి