Big Shock to Ys Jagan: వైఎస్ జగన్‌కు షాక్ ఇచ్చిన కీలక నేతలు, పార్టీకు రాజీనామా, ఘాటు విమర్శలు
Big Shock to Ys Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ఒక్కసారిగా ఇక్కట్టు చుట్టుముడుతున్నాయి. ఓ వైపు తల్లి, చెల్లితో విబేధాలు మరోవైపు కీలకనేతలు పార్టీ వీడటం జగన్‌కు షాక్ ఇస్తున్నాయి. ఇద్దరు కీలక మహిళా నేతలు ఒకేసారి పార్టీకు రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
Big Shock to Ys Jagan: గత ప్రభుత్వ హయాంలో ఏపీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్‌గా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ కూడా జగన్‌కు షాక్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేయడమే కాకుండా వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు మాజీ హోంమంత్రి సైతం పార్టీకు చెక్ చెప్పనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ మాజీ ఛైర్ పర్సన్, వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ కూడా జగన్‌కు షాక్ ఇచ్చేశారు. పార్టీకు రాజీనామా చేస్తున్నట్టు మీడియాకు లేఖ విడుదల చేశారు. అంతేకాకుండా జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ జగన్‌కు పార్టీ నడపడం చేతకాదని మండిపడ్డారు. పార్టీని నడిపించడంలో గానీ, పరిపాలనలో గానీ జగన్‌కు బాధ్యత లేదని విమర్శించారు. సమాజం పట్ల అంతకంటే గౌరవం లేదని ఆగ్రహించారు. పార్టీ కోసం కష్టపడివారి కోసం గుడ్ బుక్ అంటూ మరోసారి కార్యకర్తల్ని మోసం చేసేందుకు సిద్ధమౌతున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ప్రమోషన్లు ఇచ్చేందుకు ఇది రాజకీయ పార్టీ అని, వ్యాపార కంపెనీ కాదని స్పష్టం చేశారు. పార్టీ కోసం జీవితాలు, ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు జగన్‌కు అవసరం లేదన్నారు.
అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడిని ప్రజలు ఎప్పటికీ మెచ్చుకోరని, ఈ ఎన్నికల తీర్పు అందుకు నిదర్శనమని తెలిపారు. వ్యక్తిగతంగా, విధానపరంగా అసంతృప్తిగా ఉన్నా సరే...నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేసినట్టు చెప్పారు.
మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన మేకతోటి సుచరిత సైతం పార్టీని వీడి జనసేన పార్టీలో చేరనున్నారు. వాస్తవానికి మేకతోటి సుచరితను హోంమంత్రిగా తప్పించినప్పట్నించి ఆమె అసంతృప్తిగానే పార్టీలో కొనసాగారు. ఇప్పుడిక అధికారం కూడా కోల్పోవడంతో ఇప్పుడు పార్టీకు రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం.
Also read: AP Cabinet: ఏపీ కాబినేట్ సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.