అమరావతి: ఇప్పటికే రాష్ట్ర రాజధాని కార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాన్ని, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ గా అమరావతి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వైస్సార్సీపీ నేత, ఎంఎల్ఏ ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం మాట్లాడుతూ.. ఇకపై బహుజన అమరావతి అని, సర్వజన అమరావతి అని, సుమారు అరలక్షకు పైగా కుటుంబాలకు, ఆశ్రయం కల్పిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమరావతి ఎస్సీ, ఎస్టి, బిసి మైనారిటీలు,ఇతర కులాల్లో నిరుపేదలకు సంబంధించి 54 వేల కుటుంబాలకు ఆశ్రయం దొరుకుతుందని, మొత్తంగా 54 వేల మందికి ఇళ్ల స్దలాలు ఇస్తుంటే చంద్రబాబుకు బాధేంటని ఆయన ప్రశ్నించారు.  


ఇళ్ల స్దలాలపై చంద్రబాబు అనవసరంగా రాధ్దాంతంచేస్తున్నారని, ఎల్లోమీడియా ద్వారా చంద్రబాబు అసత్యప్రచారాలు చేస్తున్నారని, రాజధానిలోకి పేదలెవ్వరూ రానివ్వకూడదని చంద్రబాబు కుట్రపన్నుతున్నారని, రాజధానిలో చంద్రబాబు లాంటి గొప్పవాళ్లే ఉండాలా అని మండిపడ్డారు. త్వరలో అమరావతి అందరి రాజధానిగా మారబోతోందని గతంలో చంద్రబాబు తాను చేసిన వాగ్దానాలను విస్మరించారని, రాజధానిపేరుతో ఎన్నో దుర్మార్గాలు చేశారని ఆయన అన్నారు. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..