పార్లమెంట్ సమావేశాలలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన ఇద్దరు తెలుగు ఎంపీలు కరోనా బారిన పడ్డారు. కోవిడ్19 నిబంధనల నేపథ్యంలో టెస్టులు నిర్వహించడంతో ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. చిత్తూరు వైఎస్సార్‌సీపీ ఎంపీ రెడ్డప్ప (MP Reddappa Tests COVID19 Positive), అరకు ఎంపీ మాధవి కరోనా బారిన పడ్డారు. US Open 2020 Winner: యూఎస్ ఓపెన్ 2020 విజేతగా డొమినిక్ థీమ్.. 71 ఏళ్ల తర్వాత సంచలనం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వీరు ఢిల్లీకి వచ్చారు. పార్లమెంట్ సచివాలయంలో నిర్వహించిన పరీక్షల్లో ఎంపీలు రెడ్డప్ప, మాధవికి కరోనా పాజిటివ్‌ (Goddeti Madhavi Tests Positive for COVID19)గా తేలింది. అయితే వీరికి ఏ లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వీరిని ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. Rains In Telangana: తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు


కాగా, కోవిడ్19 నిబంధనల నేపథ్యంలో వీరిని పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావడానికి అనుమతించరు. ఎవరికైనా కరోనా పాజిటివ్‌‌గా తేలితే ఆ ఎంపీలు ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. కాకినాడ ఎంపీ వంగ గీత సైతం కరోనా పడటం తెలిసిందే. శనివారం నిర్వహించిన కోవిడ్19 పరీక్షలలో ఆమెకు పాజిటివ్‌గా తేలడంతో ఐసోలేషన్‌కు వెళ్లారు.


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR