కడప: శనివారం రాత్రి 9 మంది లోక్ సభ అభ్యర్థుల వివరాలు వెల్లడించిన ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మిగతా స్థానాలకు సైతం అభ్యర్థులను ప్రకటించారు. ఆదివారం ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ ఎస్సీ విభాగం నేత నందిగం సురేశ్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. బాపట్ల నుంచి లోక్ సభ అభ్యర్థిగా టికెట్ పొందిన నందిగం సురేష్ మీడియాతో మాట్లాడుతూ... ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన తనతోనే ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయించి.. అట్టడుగువర్గాలపై జగన్ తనకున్న మంచి మనసును చాటుకున్నారని అన్నారు. 


వైఎస్సార్‌సీపీ తరపున లోక్ సభ బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితా ఇదే
1. కడప - వైఎస్‌ అవినాష్‌ రెడ్డి
2. రాజంపేట - పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి
3. చిత్తూరు - నల్లకొండగారి రెడ్డప్ప
4. తిరుపతి - బల్లె దుర్గాప్రసాద్‌
5. హిందుపురం - గోరంట్ల మాధవ్‌
6. అనంతపురం - తలారి రంగయ్య
7. కర్నూలు - డాక్టర్‌ సింగరి సంజీవ్‌ కుమార్‌
8. నంద్యాల - పి బ్రహ్మానంద రెడ్డి
9. నెల్లూరు - ఆదాల ప్రభాకర్‌ రెడ్డి
10. ఒంగోలు - మాగుంట శ్రీనివాసులు రెడ్డి
11. బాపట్ల - నందిగం సురేశ్‌
12. నరసారావుపేట - లావు కృష్ణదేవరాయలు
13. గుంటూరు - మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి
14. మచిలీపట్నం - బాలశౌరి
15. విజయవాడ - పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత)
16. నరసాపురం - రఘురామ కృష్ణంరాజు
17. రాజమండ్రి - మంగన భరత్‌
18. అమలాపురం - చింతా అనురాధ
19. అనకాపల్లి -  డాక్టర్‌  వెంకట సత్యవతి
20. కాకినాడ - వంగా గీత
21. ఏలూరు - కోటగిరి శ్రీధర్‌
22. శ్రీకాకుళం - దువ్వాడ శ్రీనివాసరావు
23. విశాఖపట్నం - ఎంవీవీ సత్యనారాయణ
24. విజయనగరం - బెల్లాని చంద్రశేఖర్‌
25. అరకు - గొడ్డేటి మాధవి