AP Rajya Sabha Elections | దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో 37 సీట్లు ఇప్పటికే ఏకగ్రీవం కాగా, మిగతా 18 సీట్లకు నేడు 7 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ(4), గుజరాత్(4), మధ్యప్రదేశ్ (3), రాజస్థాన్ (3), జార్ఖండ్(2)తో పాటు మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నేటి ఉదయం ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.00 వరకు పోలింగ్ జరగనుండగా, సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది.  కొత్తిమీర అని తీసి పారేయొద్దు.. ఈ ప్రయోజనాలు తెలుసా!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠభరింతంగా జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో 4 స్థానాలకుగానూ మొత్తం అయిదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రాజ్యసభ అభ్యర్థులుగా మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానిలను బరిలోకి దింపింది. సంఖ్యాబలం ప్రకారం చూస్తే ఈ నలుగురు విజయం సాధించే అవకాశం ఉంది. అయితే టీడీపీ తమ అభ్యర్థిగా వర్ల రామయ్య బరిలో నిలిపి రేసులోకి వచ్చింది. హాట్ ఫొటోలతో యాంకర్ Varshini రచ్చరచ్చ!


టీడీపీ అభ్యర్థి ఉపసంహరించుకోక పోవడంతో ఏపీలో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఒకవేళ టీడీపీ వర్ల రామయ్యను బరిలో నిలపకుంటే ఈ నాలుగు రాజ్యస్థానాలు వైసీపీ ఏకగ్రీవంగా విజయం సాధించేంది. వైసీసీ అభ్యర్థుల విజయం లాంఛనప్రాయమే కానీ, టీడీపీ అభ్యర్థి బరిలో ఉండటంతో సాయంత్రం వరకు వేచి చూడాల్సి ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ