Viziangaram: భారీ అగ్ని ప్రమాదం..పేలిన గ్యాస్ సిలిండర్లు...30 పూరిళ్లు దగ్ధం..
Fire Accident: విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 30 ఇళ్లు దగ్ధమయ్యాయి.
Viziangaram Fire Accident: విజయనగరం జిల్లా(Vijayanagaram District)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో 30 పూరిళ్లు దగ్ధమయ్యాయి. మెంటాడ మండలం జక్కువలసలోని కోట పోలినాయుడు ఇంట్లో గ్యాస్ లీక్(Gas Leak)అవ్వడంతో..ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్రమంగా మంటలు పక్క ఇళ్లకు వ్యాపించాయి.
స్థానికులు భయంతో బయటకు పరుగులు తీస్తున్నారు. భారీ ఎత్తున మంటలు వ్యాపించడంతో ఇళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు(Gas cylinders) పేలుతున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటల(Fire)ను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.
Also Read: Cyclone Jawad: ఆంధ్రప్రదేశ్‌పై జవాద్ తుపాన్ ప్రభావం
అగ్నిప్రమాద వార్త తెలియగానే జిల్లా కలెక్టర్ సూర్యకుమారి(Collector Suryakumari).. ఘటనపై అధికారులను ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం.. మంటలు అదుపులోకి వచ్చినట్లు సూర్యకుమారి స్పష్టం చేశారు. ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితుల(victims)కు స్థానిక పాఠశాలలో వసతి కల్పించామన్నారు. అగ్నిప్రమాద బాధితులకు అన్నిరకాలుగా సాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి