Anoushka Jolly won Rs 50 lakh funding: చాలా మంది అమ్మాయిలు.. విద్యార్థినులు ఎన్నో సందర్భాల్లో వేధింపులు ఎదుర్కోవడం.. బెదిరింపులకు గురి అవుతూ ఉంటారు. వారంతా బాధను దిగమింగుకుని మౌనంగా వెళ్లిపోతుంటారు. కానీ ఒక విద్యార్థిని మాత్రం ఇలాంటి వేధింపులు.. మరో విద్యార్థిని ఎదుర్కోకూడదు అని భావించింది. ఒక యాప్ కనిపెట్టింది. తన ఐడియాను ఒక రియాలిటీ షోలో రివీల్‌ చేసి భారీ మొత్తంలో ఫండింగ్ పొందింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

13 ఏళ్ల విద్యార్థిని ఇప్పుడు అందరూ తనవైపు చూసేలా వార్తల్లోకి ఎక్కింది. చిన్న వయస్సులోనే పెద్ద ఆలోచన చేసింది. ప్రముఖ బిజినెస్ రియాలిటీ షో 'షార్క్ ట్యాంక్ ఇండియా' నుంచి రూ. 50 లక్షల ఫండింగ్ ఆఫర్‌ను అందుకుంది.


అనౌష్క జాలీ వయస్సు 13 ఏళ్లు. ఆమె ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ  విద్యార్థినికి వచ్చిన ఒక ఆలోచన ఇప్పుడు ఆమె లైఫ్‌నే ఛేంజ్‌ చేసేసింది. ఎందరో విద్యార్థులకు ఆమె తయారు చేసిన యాప్‌ ఉపయోగపడుతోంది. అనౌష్క జాలీ అప్పుడు 9 ఏళ్లు. పాఠశాల ఒక ఈవెంట్‌ జరుగుతోంది. అందులో పాల్గొన్న అనౌష్క జాలీని తోటి విద్యార్థిని వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టారు. 


దీంతో ఇలాంటి వేధింపులు ఎదురైనప్పుడు ఏం చెయ్యాలని ఆలోచించింది అనౌష్క జాలీ. దీంతో ఏదైనా ఒకటి చెయ్యాలని భావించింది. తర్వాత పలు విద్యా సంస్థలు, సామాజిక సంస్థలు, నిపుణుల సహాయంతో.. వేధింపులకు.. బెదిరింపులకు వ్యతిరేకంగా ఒక స్క్వాడ్ ఏర్పాటు అయ్యేలా చేసింది. 


తర్వాత  అనౌష్క జాలీ 'కవాచ్' అనే మొబైల్ అప్లికేషన్‌ తయారు చేసింది. ఈ యాప్‌ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుంది. స్కూల్‌లో విద్యార్థినులు ఎవరైనా వేధిస్తే.. వెంటనే కంప్లైట్‌ చేయడానికి, ఇతరులను అలెర్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. 


ఇక టీవీ రియాలిటీ షో షార్క్ ట్యాంక్‌లో తన ఆలోచనను అనౌష్క జాలీ వ్యక్తం చేసింది. దీంతో ఆమెకు రూ. 50 లక్షల ఫండింగ్ ఆఫర్‌ ఆమెను వరించింది. షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అనుపమ్ మిట్టల్, బోట్‌ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా ఈ ఫండ్ స్పాన్సర్ చేశారు. 


Also Read: Air India New CEO: ఎయిరిండియా నూతన సీఈవోగా ఇల్కర్‌


Also Read: Flipkart Sale: రూ.20,990 విలువైన వివో టీ1 5జీ ఫోన్ కేవలం రూ.490కే.. లిమిటెడ్ ఆఫర్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe