Vivo Release Cheap 5G Smartphones under Rs 20000: భారతీయ మొబైల్ మార్కెట్‌లో 'వివో' సంస్థకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎప్పటినుంచో కొత్త కొత్త మొబైల్స్ తీసుకొస్తూ.. వినియోగదారులను తనవైపు తిప్పుకుంతోంది. ఈ క్రమంలోనే గొప్ప ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఆ స్మార్ట్‌ఫోన్ Vivo Y55s 5G. తైవాన్‌లో ఈ ఫోన్‌ను రిలీజ్ చేశారు. డిసెంబర్ 2022లో ప్రవేశపెట్టిన ఈ ఫోన్ గొప్ప ఫీచర్లతో వస్తుంది. Vivo Y55s 5G పెద్ద బ్యాటరీ, 50MP కెమెరా మరియు FHD+ స్క్రీన్‌ని కలిగి ఉంటుంది. Vivo Y55s 5G ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లను ఓ సరి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo Y55s 5G Specifications:
వివో Yవై55s 5G స్మార్ట్‌ఫోన్‌ 60hz రిఫ్రెష్ రేట్, 6.55-అంగుళాల LCD డిస్ప్లై, స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కుడి వైపున ఉన్న పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అనుసంధానించబడి ఉంది. ఫోన్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4GB మరియు 6GB వేరియంట్‌లతో వస్తుంది. 128GB వరకు పొడగించుకోవచ్చు. 


Vivo Y55s 5G Camera & Battery:
వివో Yవై55s 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా మరియు 2MP పోర్ట్రెయిట్ లెన్స్ అందుబాటులో ఉన్నాయి. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. Y55s 5G డ్యూయల్ సిమ్ సపోర్ట్. డ్యూయల్ సిమ్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.1, GPS, NFC, USB-C పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.


Vivo Y55s 5G Price:
వివో Yవై55s 5G స్మార్ట్‌ఫోన్‌ 4 GB RAM + 128 GB స్టోరేజ్ ధర NTD 7,990 (రూ. 21 వేలు)లుగా ఉంది. 6 GB RAM + 128 GB స్టోరేజ్ ధర NTD 8,490 (రూ. 22, 670)లుగా ఉంది. ఈ ఫోన్ రెండు రంగులలో వస్తుంది (గెలాక్సీ బ్లూ మరియు స్టార్ బ్లాక్).


Also Read: MS Dhoni New Look 2023: ఎంఎస్ ధోనీ నయా లుక్.. ఫోటోస్ వైరల్‌!


Also Read: Tata Car Sales 2022: హ్యుందాయ్, మారుతిని కొట్టేసి.. గేమ్ గెలిచేసిన టాటా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.