Toyota Urban Cruiser Hyryder Price Hiked by Rs 60000:  భారత అటో మార్కెట్లో జపనీస్ బహుళజాతి ఆటోమోటివ్ తయారీదారు 'టయోటా మోటార్ కార్పొరేషన్' కంపెనీకి మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. టయోటా ఇన్నోవా, టయోటా ఫార్చునర్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూలై 2022లో సరికొత్త అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ని కంపనీ పరిచయం చేసింది. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ధరలు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మొదటిసారిగా పెరిగాయ్. ఇప్పుడు మరోసారి అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ ధరలు పెరిగాయి. దాంతో ఈ కారు మరింత ఖరీదైనదిగా మారింది. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ధరలు రూ.60,000 వరకు పెరిగాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త టయోటా హైరైడర్ ధరలు ఇవే (Check Latest Price List of Toyota Hyryder): 
Toyota Hyryder E వేరియంట్ - రూ. 10.73 లక్షలు (రూ. 25,000 పెరిగింది)
Toyota Hyryder S వేరియంట్ - రూ. 12.48 లక్షలు (రూ. 20,000 పెరిగింది)
Toyota Hyryder S AT వేరియంట్ - రూ 13.68 లక్షలు (రూ. 20,000 పెరిగింది)
Toyota Hyryder G వేరియంట్ - రూ. 14.36 లక్షలు (రూ. 2,000 పెరిగింది)
Toyota Hyryder G AT వేరియంట్ - రూ. 15.56 లక్షలు (రూ. 2,000 పెరిగింది)
Toyota Hyryder V వేరియంట్ - రూ. 15.91 లక్షలు (రూ. 2,000 పెరిగింది)
Toyota Hyryder V AT వేరియంట్ - రూ. 17.11 లక్షలు (రూ. 2,000 పెరిగింది)
Toyota Hyryder V AWD వేరియంట్ - రూ. 17.21 లక్షలు (రూ. 2,000 పెరిగింది)
Toyota Hyryder S హైబ్రిడ్ వేరియంట్ - రూ. 16.21 లక్షలు (రూ. 60,000 పెరిగింది)
Toyota Hyryder G హైబ్రిడ్ వేరియంట్ - రూ. 18.24 లక్షలు (రూ. 25,000 పెరిగింది)
Toyota Hyryder V హైబ్రిడ్ వేరియంట్ - రూ. 19.74 లక్షలు (రూ. 25,000 పెరిగింది)
Toyota Hyryder S CNG వేరియంట్ - రూ 13.43 లక్షలు (రూ. 20,000 పెరిగింది)
Toyota Hyryder G CNG వేరియంట్ - రూ. 15.31 లక్షలు (రూ. 2,000 పెరిగింది)


టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ధరలు వేరియంట్‌ను బట్టి రూ. 60,000 వరకు పెంచబడ్డాయి. మైల్డ్ హైబ్రిడ్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌లు రూ. 10.73 లక్షల నుంచి రూ. 19.74 లక్షల మధ్య ఉన్నాయి. అదే సిఎన్‌జి వేరియంట్ ధర రూ. 13.43 లక్షల నుంచి రూ. 15.31 లక్షల మధ్య ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలే. 


టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ యొక్క 1.5-లీటర్ పెట్రోల్ బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 114bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది E-CVTని కలిగి ఉంటుంది. బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 27.97 kmpl మైలేజీని ఇస్తుంది. 100 bhp శక్తిని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎంపికను కూడా కలిగి ఉంది. ఇది ఐచ్ఛిక AWDని కలిగి ఉంటుంది. ఇందులో 5-స్పీడ్ MT మరియు 6-స్పీడ్ AT ఎంపిక ఉంది. టయోటా అర్బన్ క్రూయిజర్ కారులో CNG వేరియంట్లు కూడా వస్తాయి.


Also Read: Miss Shetty Mr Polishetty: మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌.. అనుష్క ఏమన్నారంటే?


Also Read: 2023 Budget SUVs: 10 లక్షల లోపు 8 ఎస్‌యూవీలు.. పంచ్, నెక్సాన్, బ్రెజాతో సహా కార్ల జాబితా ఇదే!   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.