2023 Upcoming Electric Cars: 2022-2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఈవీ (ఎలక్ట్రిక్ వాహనం) అమ్మకాలు 1 మిలియన్ మార్కును దాటాయి. ఫైనాన్సియల్ ఇయర్ 2023లో మొత్తం 1,152,021 యూనిట్లు విక్రయించబడ్డాయి. ఇందులో ఇ-టూ వీలర్‌లు, ఇ-త్రీ వీలర్‌లు, ఇ-ఫోర్ వీలర్‌లు మరియు ఇ-బస్సులు ఉన్నాయి. టాటా మోటార్స్ ప్రస్తుతం ఫోర్-వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టాటా మోటార్స్ 70 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు ఇతర కార్ల తయారీదారులు కూడా ఈవీ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. అనేక కార్ల తయారీదారులు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. చాలా కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను తీసుకురానున్నాయి. దీనితో పాటు ఇప్పటికే ఉన్న పాపులర్ మోడళ్ల యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్లను కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. పాపులర్ మోడళ్ల ఎలక్ట్రిక్ వెర్షన్ కార్ల జాబితాను ఓసారి చూద్దాం. 6 ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ - Internal Combustion Engine) ఎస్‌యూవీ మోడళ్లను త్వరలో మార్కెట్లో చూడవచ్చు.


ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల కానున్న ఎస్‌యూవీలు ఇవే:
# Tata Punch EV (టాటా పంచ్ ఎలక్ట్రిక్)
# Hyundai Creta EV (హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్)
# Mahindra XUV700 EV (మహీంద్రా XUV700 ఎలక్ట్రిక్)
# Kia Carens EV (కియా కేరెన్స్ ఎలక్ట్రిక్)
# Tata Harrier EV (టాటా హారియర్ ఎలక్ట్రిక్)
# Tata Safari EV (టాటా సఫారి ఎలక్ట్రిక్)


ఈ కార్లకు సంబంధించిన ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) వెర్షన్‌లు ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో టాటా పంచ్ చౌకైనది. టాటా పంచ్ ఈవీ వెర్షన్ కూడా మిగిలిన వాటి కంటే చౌకగా ఉంటుంది. పంచ్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ 2023 ద్వితీయార్ధంలో (పండుగ సీజన్‌కు దగ్గరగా ఉండవచ్చు) ప్రారంభించబడవచ్చు. టాటా పంచ్ ఈవీ కొత్త సిగ్మా ప్లాట్‌ఫారమ్‌లో రూపొందించబడుతుంది. ఈ కారులో పెద్ద బ్యాటరీ ఉంటుంది. నివేదికల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 26kWh మరియు 30.2kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.


Also Read: MS Dhoni IPL Retirement: ఎంఎస్ ధోనీ అభిమానులకు శుభవార్త.. మహీ రిటైర్మెంట్ ఎప్పుడో తెలుసా?  


Also Read: Nitish Rana Fine: విజయానందంలో ఉన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు భారీ షాక్‌!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.