Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి పసిడి ధరలు..
Today Gold Price : దేశీయంగా బంగారం ధరలు పరిశీలిస్తే.. 10 గ్రాములపై స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఈ రోజు దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
Today Gold Price : బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సోమవారం పసిడి ధరల్లో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. సాధారణంగా బంగారం ధర మార్కెట్‌లో ఎప్పటికప్పుడు మారుతుంటుంది. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ తదితర కారణాలు పసిడి రేట్లపై ప్రభావం చూపిస్తుంటాయి. ఈ రోజు (జనవరి 24) దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Gold Price) ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు..
* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,520 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,520 ఉంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,390 ఉంది.
* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,390 ఉంది.
Also Read: Cryptocurrency: పడిపోతున్న క్రిప్టోకరెన్సీ ధర, రష్యా ప్రభుత్వ నిషేధ ప్రకటన ఫలితమేనా
తెలుగు రాష్ట్రాల్లో..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook