Cooler Cooling Tips And Tricks: దేశంలో  ఎండలు  మండిపోతున్నాయి. చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఏసీలకు, కూలర్లకు పనిచెప్పారు. ఇప్పటికీ చాలా మంది పాత కూలర్లనే (Old Cooler) వాడుతున్నారు. అయితే ఈ పాత కూలర్ల చల్లటి గాలిని ఇవ్వటం లేదా? అయితే ఈ 3 చిట్కాలు పాటించడం వల్ల మీకు ఏసీ లాంటి గాలి వస్తుంది. అంతేకాకుండా మీరు కొత్త కూలర్‌ను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యకాంతి పడే చోట ఉంచొద్దు
ఎక్కువగా సూర్యకాంతి పడే చోట కూలర్‌ను ఉంచుతారు. దీని వల్ల చల్లటి గాలి రాదు. ప్రజలు  తరచుగా ఈ తప్పు చేస్తారు. సూర్యకాంతి లేని ప్రదేశంలో కూలర్‌ను ఉంచండి. ఇంట్లో ప్రతిచోటా సూర్యరశ్మి వస్తుంటే, నేరుగా సూర్యకాంతి కూలర్‌పై పడకుండా అలాంటి ఏర్పాట్లు చేయండి.


బహిరంగ ప్రదేశంలో ఉంచండి
కూలర్ కొత్తదైనా, పాతదైనా... ఎప్పుడూ బహిరంగ ప్రదేశంలో ఉంచండి. సరళంగా చెప్పాలంటే, కూలర్ బహిరంగ ప్రదేశంలో చల్లని గాలిని ఇస్తుంది. అందువల్ల, కిటికీలో లేదా మెష్ తలుపు దగ్గర కూలర్‌ను ఉంచండి. 


వెంటిలేషన్ ఉండాలి
వెంటిలేషన్ లేని ప్రదేశంలో మీరు కూలర్‌ను ఉంచినట్లయితే... అది చల్లటి గాలిని ఇవ్వదు. కూలర్‌కు తగినంత వెంటిలేషన్ అవసరం. గది నుండి గాలి బయటకు వచ్చినప్పుడు మాత్రమే కూలర్ చల్లబడుతుంది.


Also Read: Warranty- Guarantee Difference: గ్యారెంటీ, వారెంటీకి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook