స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. జనవరి వరకు ఆగండి! కొత్త ఏడాదిలో లాంచ్ అవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!!
వన్ ప్లస్ (OnePlus), వివో (Vio), రియల్ మీ (Realme) మరియు ఇన్ఫినిక్స్ (Infinix) వంటి సంస్థలు జనవరి 2022లో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నాయి.
5 best smartphones launching in January 2022: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ (Smart Phone) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి (Coronavirus) తర్వాత స్మార్ట్ఫోన్ల విక్రయాలు మరింత జోరందుకున్నాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు అన్ని మొబైల్ తయారీ సంస్థలు వరుసగా కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. ఈ డిసెంబర్ మాసంలో కొన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కాగా.. కొత్త ఏడాదిలో మరిన్ని ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. వన్ ప్లస్ (OnePlus), వివో (Vio), రియల్ మీ (Realme) మరియు ఇన్ఫినిక్స్ (Infinix) వంటి సంస్థలు జనవరి 2022లో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నాయి.
జనవరి 2022లో వన్ ప్లస్ మొబైల్ సంస్థ వన్ ప్లస్ 10 ప్రో (OnePlus 10 Pro)ను లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen1 చిప్‌సెట్ ఉంటుంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల ఎల్‌పీటీఓ క్యూహెచ్‌డీ ప్లస్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 12GB ర్యామ్‌తో పాటు 128GB లేదా 256GB ఉంటుంది. వివో V23 సిరీస్‌ను జనవరి 5న లాం చేస్తున్నట్లు వివో ఇప్పటికే ప్రకటించింది. 7.36mm 3D కర్వ్ డిస్‌ప్లేతో రానుందని సమాచారం. S12 ప్రో లోని కొన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి.
Also Read: Allu Arjun: మేమంతా ఒకటే.. మా మధ్య విభేదాలా! ఒకే ఒక్క ఫోటోతో రూమర్లకు చెక్ పెట్టేసిన అల్లు అర్జున్!!
రియల్ మీ కూడా కొత్త ఏడాదిలో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. GT సిరీస్‌లో భాగంగా రియల్ మీ GT 2 Proను భారత మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. స్లిమ్ బెజెల్స్‌తో పంచ్-హోల్ స్క్రీన్ ఇందులో ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. లావా మరియి రెడ్ మీ 5G స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా ఇన్ఫినిక్స్ కూడా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బరిలోకి తెస్తోంది. దీని ధర దాదాపుగా 20,000 వేలు ఉంటుందని తెలుస్తోంది. రెడ్ మీ కొత్త సంవత్సరంలో రెండు స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తోంది. షియోమీ 11 సిరీసులో భాగంగా షియోమీ 11i, షియోమీ 11i హైపర్ ఛార్జర్‌లను లాంచ్ చేస్తోంది.
Also Read: Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్.. ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook