7th Pay Commission: త్వరలోనే డీఏ పెంపు.. జీతం ఎంత వరకు పెరుగుతుందో తెలుసా?
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం డీఏ 4 శాతం పెంచబోతోందని ఏడవ వేతన సంఘ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏయే ఉద్యోగాల వారికి బేసిక్ పే పెరుగుతుందో, ప్రాథమిక వేతనం పెరుగుతుందా లేదా ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
7th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. త్వరలో ఉద్యోగులకు బేసిక్ జీతాలను పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. 2016లో ప్రభుత్వం 7 సీపీసీని అమలు చేయగా..ఆ తర్వాత ప్రభుత్వం కనీస వేతనాల్లో భారీ మార్పులు చేసి ఒక్క సారిగా పెంచింది. ఇటీవల వచ్చిన మీడియా కథనాల ప్రకారం..ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఒక వేళ ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రభుత్వం పెంచితే బేసిక్ పేతో పాలు జీతాలు కూడా పెరిగే అవకాశాలున్నాయి.
జీతం ఎంత పెరగొచ్చు:
ఏడవ వేతన సంఘం అమలులోకి వచ్చినప్పుడు ఉద్యోగుల కనీస వేతనం రూ.6,000 కాగా.. ఆ తర్వాత ప్రభుత్వం కనీస వేతనం రూ. 18,000లకు పెంచింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను బేసిక్ వేతనం కంటే 2.57 రెట్లుగా నిర్ణయించారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను మూడు రెట్లు పెంచడంతో ఉద్యోగుల కనీస వేతనం రూ.26,000 అవుతుంది.
ప్రాథమిక వేతనం పెరుగుతుందా?:
సెవెన్త్ పే కమీషన్ కింద కేంద్రం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 రెట్లు పెంచాలని నిర్ణయించింది. కాబట్టి ఈ క్రమంలో జీతం కూడా పెరుగుతుందని ఏడవ వేతన సంఘం నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే డియర్‌నెస్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, బేసిక్ జీతం వంటి అలవెన్సులను ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో లెక్కిస్తారు..ఇవి కూడా జీతంలో భాగం కాబట్టి జీతం కూడా పెరుగుతుంది. కాబట్టి బేసిక్ పే రూ. 18,000 ఉన్నవారికి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా లెక్కిస్తే.. జీతం రూ. 42,000 కంటే ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో అలవెన్సులు కూడా ఉంటాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మూడు రెట్లు పెరిగితే, మూల వేతనం మరింత పెరుగుతుంది.
4 శాతం డీఏ పెరుగుతుందని అంచనా:
ప్రభుత్వం త్వరలోనే డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతుందని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ వచ్చే సంవత్సరం జూలైలో జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల డీఏను 4 శాతం పెంచవచ్చు. ఈ పెరుగుల ఏఐసీపీఐ లెక్కల ఆధారంగానే నిర్ణయింస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి