7th Pay Commission DA Hike: 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పణకు ముహుర్తం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిసారిలాగే ఈ బడ్జెట్‌పై కూడా కార్మికవర్గం, రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్‌లో కేంద్ర ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఆర్థిక మంత్రి పెంచుతారని కూడా ప్రచారం జరుగుతోంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోయినా.. ఉద్యోగుల డీఏ పెంపుపై మాత్రం మార్చిలో ప్రకటన వెలువడడం ఖాయం. హోలీకి ముందే ఈ ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ డీఏ పెంపు వల్ల కోటి మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈసారి డీఏ ఎంత పెరుగుతుంది..?


మార్చిలో డియర్‌నెస్ అలవెన్స్‌కు సంబంధించిన ప్రకటన రానుండగా.. జనవరి 1 నుంచి వర్తిస్తుంది. డిసెంబరు నెలాఖరుకు వచ్చే ఏఐసీపీఐ ఇండెక్స్‌ డేటాను బట్టి ఈసారి ఎంత డీఏ పెరుగుతుందనేది స్పష్టమవుతుంది. జూలై 2022 పెరుగుదల ఆధారంగా.. కేంద్ర ఉద్యోగులు 38 శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ని పొందుతున్నారు. రానున్న కాలంలో ఈ సంఖ్య 41 లేదా 42 శాతానికి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


ఈసారి డీఏలో కనీసం 3 శాతం పెంపు ఖరారైనట్లు భావిస్తున్నారు. ఉద్యోగులకు ఇది గొప్ప రిలీఫ్ న్యూస్. ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ రూ.25,000 అయితే.. 3 శాతం ప్రకారం అతని జీతం నెలకు రూ.750 పెరుగుతుంది. అతని స్థూల జీతం వార్షిక ప్రాతిపదికన రూ.9 వేలు పెరుగుతుంది. క్యాబినెట్ సెక్రటరీ స్థాయి అధికారుల జీతం నెలకు రూ.7,500 అంటే ఏడాదికి రూ.90,000 పెరుగుతుందని అంచనా. ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి డియర్‌నెస్ అలవెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. దీనిని ఉద్యోగి బేసిక శాలరీ ఆధారంగా లెక్కిస్తారు.


మరోవైపు ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2.57 నుంచి 3.68 శాతానికి పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని గతంలో వర్గాలు పేర్కొన్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సవరించడం ముసాయిదాలో చర్చకు వస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రస్తుతం 2.57 శాతం ప్రకారం.. 18000 (18,000 X 2.57 = 46260) మూల వేతనంపై ఉద్యోగులు రూ.46,260 పొందుతున్నారు. 3.68 శాతానికి పెంచితే ఇతర అలవెన్సులు మినహాయిస్తే జీతం 26000X3.68 = రూ.95,680 అవుతుంది.


Also Read: Amazon Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్  


Also Read: Telangana Teacher Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి