Fitment Factor Hike: ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పణకు సమయం ఆసన్నమవుతోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై ప్రజల్లో అంచనాలు కూడా పెరుగుతున్నాయి. ఉద్యోగ నిపుణుల నుంచి రైతుల వరకు.. సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు.. లోక్‌సభ ఎన్నికలకు ముందు వచ్చే చివరి పూర్తి బడ్జెట్‌ కావడంతో ప్రభుత్వం ఈసారి కచ్చితంగా ఏదో భారీ ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు. అదేవిధంగా బడ్జెట్‌లో కేంద్ర ఉద్యోగులు కూడా శుభవార్త అందుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ప్రకటన అంచనా..


ఈ బడ్జెట్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కు సంబంధించి ఆర్థిక మంత్రి నుంచి ప్రచార పెద్ద ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. ఉద్యోగల జీతాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో మార్పు జరిగితే.. రూ.26 వేలకు పెరుగుతుంది.


2.57 నుంచి 3.68 రెట్లు పెంచాలని డిమాండ్


ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2.57 శాతం ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్ అందుకుంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని గతంలో వర్గాలు పేర్కొన్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సవరించడం ముసాయిదాలో చర్చకు వస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుంచి 3.68 శాతానికి పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.


ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతం ప్రకారం.. 18000 (18,000 X 2.57 = 46260) మూల వేతనంపై ఉద్యోగులు రూ.46,260 పొందుతారు. ఉద్యోగుల డిమాండ్ ప్రకారం 3.68 శాతానికి పెంచితే ఇతర అలవెన్సులు మినహాయిస్తే జీతం 26000X 3.68 = రూ.95,680 అవుతుంది. దీంతో పాటు బడ్జెట్ తర్వాత 2023 మార్చి 1న జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈసారి 4 శాతం పెంచే అవకాశం కనిపిస్తోంది.


Also Read: Amazon Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్  


Also Read: Telangana Teacher Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి