7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం ఇటీవల లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (DR)ని పెంతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు త్వరలో మరో బహుమతిని ఇవ్వబోతోందని అధికారిక వర్గాల సమాచారం. ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జూలైలో మరోసారి డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచే ఛాన్స్‌ ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డీఏ, డీఆర్‌లను 4-4 శాతం పెంపు:
ప్రభుత్వం ఇటీవల డీఏ, డీఆర్‌లను 4-4 శాతం పెంచిన సంగతి తెలిసిందే.. పెరిగిన రేట్లు జనవరి 1 నుంచి అమలులోకి రాగా.. ఇప్పుడు మళ్లీ డీఏ, డీఆర్ పెంపుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం మరోసారి పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా పెన్షనర్లకు పెద్ద మొత్తంలో డబ్బు పొందే ఛాన్స్‌ ఉంది.


Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో


ఏడాదికి రెండుసార్లు పెరుగుతుంది!
7వ వేతన సంఘం ప్రకారం.. డీఏ, డీఆర్‌లను ఏడాదికి రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది. మొదట జనవరిలో డియర్‌నెస్ అలవెన్స్, రిలీఫ్ పెంచగా.. జూలైలో రెండవ రివిజన్ పెంచుతారు. ఆల్-ఇండియా CPI డేటా అంటే AICPI ఇండెక్స్ (ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్) ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. దీని గణాంకాల కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కింద లేబర్ బ్యూరోచే జారీ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లను ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం లభించేందుకు జీతం/పెన్షన్‌కు DA/DR అట్టాచ్‌ చేస్తారు. 


ఊహాగానాలు:
 పత్రికా ప్రకటన ప్రకారం.. ఫిబ్రవరి నెలలో AICPI ఇండెక్స్ 0.1 పాయింట్లు తగ్గి 132.7 వద్ద నిలిచింది. జనవరిలో ఈ సూచీ 132.8 పాయింట్లుగా నమోదైన సంగతి అందరికీ తెలిసిందే.. మార్చి నెల డేటా 28 ఏప్రిల్ 2023న కేంద్ర విడుదల చేస్తుంది. ఫిబ్రవరిలో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా.. మరోసారి డియర్‌నెస్ అలవెన్స్, రిలీఫ్ పెంచే ఛాన్స్‌ ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్‌లను 3-3 శాతం పెంచే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం.


ఇప్పుడున్న డీఏ రేటు ఇదే!
కరోనా కారణంగా.. డీఏలో సవరణ కొంత మార్పులు వచ్చింది. సుమారు ఒకటిన్నర సంవత్సరాల విరామం తర్వాత.. కేంద్ర ప్రభుత్వం జూలై 2021లో డీఏ, డీఆర్‌లను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచింది. ఆ తర్వాత అక్టోబర్ 2021లో 28 శాతం నుంచి 31 శాతానికి పెరిగింది. దీంతో డీఏ, డీఆర్‌ల రేట్లు నిరంతరం పెరుగుతూ.. 42 శాతానికి చేరాయి. జూలైలో 3 శాతం పెంపు అంచనాలు నిజమైతే..DA, DR రేటు 45 శాతానికి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 


Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook