7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. ఇలా చేస్తే హెచ్ఆర్ఏ కట్
7th Pay Commission HRA New Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి హెచ్ఆర్ఏ పొందలేరు. అవును కేంద్ర ఆర్థిక శాఖ కొన్ని కీలక మార్పులు చేసింది. అయితే అన్ని సందర్భాల్లో కాదు. 7వ వేతన సంఘం నిబంధనలలో జరిగిన మార్పులు ఇవే..
7th Pay Commission HRA New Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక. 7వ వేతన సంఘం నిబంధనలలో ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. ఇక నుంచి కొన్ని సందర్భాల్లో మీకు హౌస్ రెంట్ అలవెన్స్ లభించదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగం (DoE) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇంటి అద్దె అలవెన్స్ (HRA) నిబంధనలను మార్పు చేసింది.
వీరు హెచ్‌ఆర్‌ఏ అనర్హులు..
ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మరో ఉద్యోగితో వసతి షేర్ చేసుకుంటే హెచ్‌ఆర్ఏకు అనర్హులవుతారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తమ కేటాయించిన క్వార్టర్స్‌ను తల్లిదండ్రులకు లేదా తమ పిల్లలకు కేటాయించినా హెచ్ఆర్ఏ రాదు. ప్రభుత్వ ఉద్యోగి జీవిత భాగస్వామి కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం, అటానమస్ పబ్లిక్ సెక్టార్ సంస్థలు, సెమీ-గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు (మునిసిపాలిటీలు, పోర్ట్ ట్రస్ట్‌లు, జాతీయం అయిన బ్యాంకులు, ఎల్ఐసీ) మొదలైన వాటిలో పనిచేస్తూ.. ఒకే చోట ఉంటూ అందుకు అద్దె తీసుకుంటే హెచ్ఆర్ఏ పొందలేదు.
ఇంటి అద్దె భత్యం అంటే..
అద్దె ఇంట్లో నివసించే జీతభత్యాల ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్స్ ఇస్తారు. అద్దె ఇళ్లలో నివసించే జీతం పొందే వ్యక్తులు తమ పన్నులను పాక్షికంగా లేదా పూర్తిగా తగ్గించుకోవడానికి ఇంటి అద్దె అలవెన్స్ (HRA)ని క్లెయిమ్ చేయవచ్చు. మీరు అద్దె వసతి గృహంలో నివసించకపోతే.. ఈ భత్యం పూర్తిగా ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది.
హెచ్ఆర్ఏ ఇలా ఇస్తారు..
హౌస్ రెంట్ అలవెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం మూడు విభాగాల కింద విభిజించి ఇస్తోంది. 50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో 7వ వేతన సంఘం సిఫార్సు చేసిన ప్రకారం.. 24 శాతం చెల్లిస్తోంది. 5 లక్షల నుంచి 50 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతాలలో 16 శాతం, 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న చోట 8 శాతం హెచ్ఆర్ఏ ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతోంది.
Also Read: India vs Sri Lanka: రాజ్‌కోట్‌లో సూర్య సునామీ.. బౌలర్ల మెరుపులు.. శ్రీలంక చిత్తు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook