7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గమనిక.. డీఏ పెంపు ఎప్పుడంటే..?
7th pay commission Latest Update: కొత్త ఏడాదిలో డీఏ పెంపు ప్రకటన కోసం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. 4 శాతం డీఏ పెంచే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగుల ఖాతాలో హోలీ పండుగకు ముందే జమ అయ్యే ఛాన్స్ ఉంది.
7th pay commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కొత్త సంవత్సరంలో హోలీకి ముందే ఉద్యోగుల జీతాల్లో బంపర్ పెరుగుదల ఉండబోతోంది. ప్రభుత్వం మరోసారి ఉద్యోగుల కరువు భత్యాన్ని 4 శాతం పెంచే అవకాశం కనిపిస్తోంది. ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ద్వారా ఈ విషయం వెల్లడైంది. ప్రతి ఏడాది రెండు సార్లు పెంచుతున్న విషయం తెలిసిందే. మొదటి పెంపు జనవరి నెలలో, రెండో పెంపు జూలై నెలలో జరుగుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభమైనందున ఉద్యోగులు తమ డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు.
ఇప్పటివరకు విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రభుత్వం ఈసారి కూడా 4 శాతం లేదా 3 శాతం వరకు పెంచవచ్చు . ఇందుకోసం నవంబర్, డిసెంబర్ రెండింటిలోనూ ఏఐసీపీఐ ఇండెక్స్ 0.4 పాయింట్లు పెరగాల్సి ఉంటుంది. ఉద్యోగుల డీఏలో 4 శాతం పెరుగుదల ఉంటే.. కరువు భత్యం 42 శాతానికి చేరుతుంది. ప్రస్తుతం 38 శాతంగా డీఏ ఉంది. 2022 జూలైలో కూడా ప్రభుత్వం ఉద్యోగుల డీఏను 4 శాతం పెంచింది. డీఏ, డీఆర్‌ల పెంపుతో 48 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
42 శాతం చొప్పున డీఏ పెంపుతో లెవెల్-3 జీతం ఎంత పెరుగుతుంది
>> ఉద్యోగి ప్రాథమిక జీతం- రూ.56,900
>> కొత్త డియర్‌నెస్ అలవెన్స్ (42 శాతం)- రూ.23,898/నెల
>> ఇప్పటివరకు డియర్‌నెస్ అలవెన్స్ (38 శాతం)- రూ.21,622/నెల
>> ఎంత డియర్‌నెస్ అలవెన్స్ పెరిగింది-23898-21622 = రూ.2276/నెల
>> వార్షిక జీతంలో పెరుగుదల -2276X12= రూ.27,312
అక్టోబర్‌లో ఏఐసీపీఐ సూచిక 132.5 పాయింట్ల వద్ద ఉంది. అంతకుముందు సెప్టెంబర్‌లో ఇది 131.3 పాయింట్లు. ఆగస్టులో ఈ సంఖ్య 130.2 పాయింట్లు. జూలై నుంచి ఇందులో స్థిరమైన పెరుగుదల ఉంది. అక్టోబర్ తర్వాత నవంబర్‌లోనే స్తబ్ధత కనిపించింది. నవంబర్‌లో పాయింట్ల పెరుగుదలలో ఎలాంటి మార్పు లేదు. అయితే ఇక డిసెంబర్ నెల గణాంకాలు మాత్రమే రావాల్సి ఉంది. ఏఐసీపీఐలో నిరంతర పెరుగుదల కారణంగా 65 లక్షల మంది ఉద్యోగులకు కొత్త సంవత్సరం జనవరిలో డీఏ పెంపునకు మార్గం సుగమమైంది.
Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
Also Read: చంద్రబాబుకు మీడియా మొత్తం సపోర్ట్ చేసినా.. వైఎస్సార్‌ను ఏం చేయలేకపోయారు: రేవంత్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook