HBA Interest Rates: కొత్త ఏడాదిలో డీఏ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. జనవరి నెలకు సబంధించిన డీఏ పెంపు ప్రకటన మార్చిలో వెలువడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇంతకుముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేదువార్తలు వస్తున్నాయి. ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనను మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఉద్యోగులకు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (హెచ్‌బీఎ) రేటును ప్రభుత్వం 7.1కి తగ్గించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తక్కువ వడ్డీకే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (హెచ్‌బీఏ) పొందుతున్నారు. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1 ఏప్రిల్ 2022 నుంచి 31 మార్చి 2023 వరకు హెచ్‌బీఏ వడ్డీ రేటును ఏటా 7.9 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించింది. కొత్త ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి హెచ్‌బీఏపై వడ్డీ రేటు పెరగనుందని ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.


ప్రభుత్వం తీసుకున్న గతంలో తీసుకున్న నిర్ణయంతో ఏప్రిల్ 1, 2022, మార్చి 31, 2023 మధ్య ఇళ్లు నిర్మించుకున్న లేదా ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి పెద్ద ఉపశమనం లభించింది. ఏడవ వేతన సంఘం సిఫారసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌బీఎ ప్రయోజనం అందించింది. నిబంధనల ప్రకారం కొత్త ఇంటి నిర్మాణం, నివాస స్థలాన్ని పొడిగించడం, హౌసింగ్ బోర్డు లేదా అథారిటీ ప్లాట్లు కొనుగోలు చేయవచ్చు.


ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయంలో కేంద్ర ఉద్యోగులు తమ బేసిక్ శాలరీకి 34 రేట్లు లేదా గరిష్టంగా రూ.25 లక్షల వరకు అడ్వాన్స్ తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఉద్యోగి తన లేదా తన భార్య పేరు మీద తీసుకున్న ప్లాట్‌లో ఇల్లు కట్టడానికి లేదా ఫ్లాట్ తీసుకోవడానికి అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఈ పథకం 1 అక్టోబర్ 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని కింద మార్చి 31, 2023 వరకు ప్రభుత్వం ఉద్యోగులకు 7.1 శాతం వడ్డీతో గృహ నిర్మాణ అడ్వాన్స్‌ను ఇస్తుంది. ఆ తరువాత వడ్డీ రేటు పెరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. వడ్డీ రేట్లు పెంచితే ప్రభుత్వ ఉద్యోగులకు మరింత భారం కానుంది.


Also Read: Tech Mahindra: డిజిటల్ రంగంలో సరికొత్త అధ్యాయం.. టెక్ మహీంద్రాతో జతకట్టిన మైక్రోసాఫ్ట్‌   


Also Read:  PAK vs NZ: అంపైర్ కాలికి బంతిని విసిరిన పాక్ బౌలర్.. కోపంతో జెర్సీని నేలకు కొట్టి..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి