DA Hike News: ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్తలు ప్రకటిస్తున్నాయి. కొత్త ఏడాదికి ముందే ఉద్యోగులకు మేఘాలయ ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం పెంచడానికి ఆమోదించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో ప్రయోజనం కలగనుంది. తాజాగా పెంచిన డీఏ జూలై 2022 నుంచి అమలులోకి వస్తుంది. ప్రభుత్వం ప్రకటన తరువాత మేఘాలయ ఉద్యోగుల డీఏ 28 శాతం నుంచి 32 శాతానికి పెరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 29న కరువు భత్యాన్ని 4 శాతం పెంచేందుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్ల ఖాతాల్లోకి 38 శాతం చొప్పున డీఏ పొందుతున్నారు. ఇక ఇప్పటివరకు వచ్చిన AICPI గణాంకాలను చూస్తుంటే.. 2023 జనవరిలో మరోసారి కేంద్ర ఉద్యోగుల డీఏ పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. 


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 38 శాతం డియర్‌నెస్‌ అలవెన్స్‌ లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరువు భత్యాన్ని పెంచాయి. వీటిలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, యూపీ, కర్ణాటక, పంజాబ్, అస్సాం మొదలైనవి ఉన్నాయి. ఇప్పుడు మేఘాలయ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు పెరిగిన జీతం, పెన్షన్ ప్రయోజనం పొందుతారు. దీంతో పాటు 2023లో కూడా పెరిగిన అలవెన్స్ మొత్తం ఉద్యోగుల ఖాతాలో చేరనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యూ ఇయర్ సంబురాలు రెట్టింపు అయ్యాయి.


కొత్త ఏడాది ప్రారంభానికి ముందే పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ సర్కార్ వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకను అందించిన విషయం తెలిసిందే. 2023 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలల సిబ్బందికి 7వ వేతన స్కేలు ప్రకారం వేతనాలు అందజేయనున్నట్లు సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వం ప్రకటించింది. రెగ్యులర్ టీచర్లు, గెస్ట్ టీచర్లు, కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న టీచర్లు, గెస్ట్ ఫ్యాకల్టీ, పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీలు ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజనం పొందనున్నారు. దీంతో పాటు వాటిలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి కూడా ఈ బకాయిలు అందజేయనున్నారు.


Also Read: Rishabh Pant Car Accident: మూడేళ్ల క్రితమే హెచ్చరించిన శిఖర్ ధావన్‌.. పట్టించుకోని రిషబ్ పంత్!  


Also Read: అమ్మతనానికే మాయని మచ్చ.. పడక సుఖం కోసం నాలుగేళ్ల పిల్లాడిని చంపేసింది!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి