7th Pay Commission Latest Update: కొత్త ఏడాది ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ సర్కార్ వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకను అందించింది. కొత్త సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలల సిబ్బందికి 7వ వేతన స్కేలు ప్రకారం వేతనాలు అందజేయనున్నట్లు సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వం ప్రకటించింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పే స్కేల్ 2 వాయిదాలలో అందజేత..


సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం రోజున కాలేజీలు, యూనివర్సిటీల సిబ్బందికి 7వ వేతన కమిషన్‌ ప్రయోజనాలను అందజేస్తామని సీఎం భగవంత్‌ మాన్‌ ప్రకటించారని ఉన్నత విద్యాశాఖ మంత్రి గుర్మీత్‌సింగ్‌ మీట్‌ హరే తెలిపారు. ఇప్పుడు అదే బకాయిలను 2 విడతలుగా చెల్లించాలని నిర్ణయించారు. పంజాబ్‌లోని ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న రెగ్యులర్ టీచర్లు, గెస్ట్ టీచర్లు, కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న టీచర్లు, గెస్ట్ ఫ్యాకల్టీ, పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీలు ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజనం పొందనున్నారు. దీంతో పాటు వాటిలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి కూడా ఈ బకాయిలు అందజేయనున్నారు. 


ఆరేళ్ల డిమాండ్ నెరవేరింది


గత 6 సంవత్సరాలుగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయుల పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను ఆప్ ప్రభుత్వం నెరవేర్చిందని ఉన్నత విద్యాశాఖ మంత్రి గుర్మీత్ సింగ్ మీట్ హెయిర్ తెలిపారు. దీంతో ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.280 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. నిధుల పంపిణీ లేదా సవరించిన వేతనం రాష్ట్ర ఖజానా నుంచి విడుదల చేయనుంది ప్రభుత్వం.


మరోవైపు అమృత్‌సర్‌లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో పంజాబీ భాష ప్రమోషన్ గురించి సీఎం భగవంత్ మాన్ కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇంకా 2 నెలల సమయం ఉందని.. ఆలోపు అన్ని బోర్డులు ప్రాధాన్యతా ప్రాతిపదికన పంజాబీ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అలాచేయని పక్షంలో ఫిబ్రవరి 21 తర్వాత వారిపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. 


Also Read: Rishabh Pant: రోడ్డుప్రమాదంలో రిషబ్‌ పంత్‌కు తీవ్రగాయాలు.. కాలి బూడిదైన కారు  


Also Read: Highest Earing Players in IPL: ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్లు వీళ్లే.. రోహిత్ శర్మ తరువాత ఎవరంటే..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి