Night Duty Allowance for Govt Employees | కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల కోసం కొన్ని నియామాలు మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు డియర్‌నెస్ అలవెన్స్ పెండింగ్ బకాయిల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే నైట్ డ్యూటీ అలవెన్స్ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే సమయంలో 7వ వేతన సంఘం సిఫార్సులు అమలు తరువాత, నైట్ డ్యూటీ అలవెన్స్ పొందిన వారి నుండి రికవరీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. వివిధ పరిస్థితులలో పనిచేసే కార్మికుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నైట్ డ్యూటీ అలవెన్స్ అందించడానికి రైల్వే విభాగం సిబ్బంది మరియు శిక్షణ శాఖ(DOPT)కి ఓ లేఖ రాసింది. అందుకు ఆమోదం లభించింది. జూలై నెల జీతాల నుంచి నైట్ డ్యూటీ స్పెషల్ అలవెన్స్(Night Duty Allowance) ఉద్యోగులు అందుకోనున్నారు. దీనిపై త్వరలోనే పూర్తి స్థాయిలో నిర్ణయం అనంతరం కేంద్రం ప్రకటన చేయనుంది.


Also Read: 7th Pay Commission: ఉద్యోగుల పనివేళలు 12 గంటలకు, కానీ టేక్ హోమ్ శాలరీ తగ్గింపు


ఇటీవల రైల్వే యూనియన్లు నైట్ డ్యూటీ అలవెన్స్ సమస్యను రైల్వే మంత్రిత్వ శాఖకు వివరించాయి. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. ఒక కార్మికుడికి నైట్ డ్యూటీ అలవెన్స్ ఇవ్వకపోతే అతన్ని / ఆమెను రాత్రివేళ విధులు నిర్వహించడానికి పిలవకూడదని డిమాండ్లలో పేర్కొన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT) అన్ని శాఖలలో ప్రభుత్వ ఉద్యోగులకు నైట్ డ్యూటీ అలవెన్స్ ఎంత మేర కేటాయించాలో త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనుంది.


‘గ్రేడ్ పే’తో సంబంధం లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల నైట్ డ్యూటీ అలవెన్స్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు, గ్రేడ్ ఎ ఉద్యోగులందరికీ ఒకే నైట్ డ్యూటీ అలవెన్స్ ఇచ్చారు. ఇకనుంచి ఉద్యోగుల జీతాలలో కొంత మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాత్రివేళ విధులు నిర్వహిస్తే, 10 నిమిషాల వెయిటేజీ ఇవ్వనున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో షిఫ్టులో ఉంటే నైట్ షిఫ్ట్ అని వ్యవహరిస్తారు. 


Also Read: FD Schemes: ఇన్వెస్టర్లకు శుభవార్త, Fixed Depositపై తుది గడువు పొడిగించిన బ్యాంకులు


రైల్వే ఉద్యోగులకు నైట్ డ్యూటీ భత్యం (Night Duty Allowance) లెక్కించడానికి నిబంధనలలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. ఇది తక్షణమే అమల్లోకి రానుంది. నైట్ డ్యూటీ అలవెన్స్ లెక్కించడానికి ఒక ఫార్ములా తయారు చేశారు. [(మూల వేతనం + డీఏ / 200] ఫార్ములా ఆధారంగా నైట్ డ్యూటీ అలవెన్స్ అందించనున్నారు. ఈ ఫార్ములా అన్ని ప్రభుత్వ విభాగాలు మరియు మంత్రిత్వ శాఖలకు వర్తిస్తుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook