7th Pay Commission: మరో నాలుగు రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు అందుకోనున్నారు. ఈసారి మార్చ్ నెల జీతం బంపర్‌గా ఉండనుంది. పెరిగిన డీఏ, హెచ్ఆర్ఏ జనవరి నెల నుంచి రావల్సి ఉండటంతో పెద్దమొత్తంలో డబ్బులు అందుతాయి. జనవరిలో పెరగాల్సిన డీఎను 4 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దాంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకోనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం డీఏ 4 శాతం పెంచడంతో మొత్తం 49.18 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అనేది జీతంలో భాగమే. అందుకే డీఏ పెరిగిందంటే నెట్ శాలరీ కూడా పెరుగుతుంటుంది. ఇప్పుడు మార్చ్ నెలలో పెరిగిన 4 శాతం డీఏతో భారీగా జీతం చేతికి అందుతుంది. 45,700 రూపాయల బేసిక్ శాలరీ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొన్నటి వరకూ ఉన్న 46 శాతంతో డీఏ 21,022 రూపాయలుండేది. ఇప్పుడా డీఏ 50 శాతానికి చేరుకోవడంతో అది కాస్తా 22,850 రూపాయలైంది. అంటే అదనంగా 1818 రూపాయలు లబిస్తోంది. 


ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే హెచ్ఆర్ఏ అనేది ఆ ఉద్యోగి నివసించే ఊరిని బట్టి ఉంటుంది. హెచ్ఆర్ఏ ప్రకారం డీఏ 25 శాతం చేరినప్పుడు హెచ్ఆర్ఏ ఎక్స్, వై, జెడ్ కేటగరీలకు 27 శాతం, 18 శాతం, 9 శాతం ఉంటుంది. అదే డీఏ 50 శాతమైతే హెచ్ఆర్ఏ మరోసారి పెరుగుతుంది. వై కేటగరీలో ఉండే 45,700 బేసిక్ శాలరీ తీసుకునే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 8,226 రూపాయలు లభిస్తాయి. డీఏ 50 శాతమైతే హెచ్ఆర్ఏ 20 శాతం పెరుగుతుంది. అంటే 9,140 రూపాయలవుతుంది. 


Also read: Lenovo M11 Tab: 7వేల ఎంఏహెచ్ బ్యాటరీ, 8జీబి ర్యామ్‌తో చాలా తక్కువ ధరకే లెనోవో ట్యాబ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook