7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవలే డీఏ 4 శాతం పెరగడంతో 50 శాతానికి చేరుకుంది. జనవరి 2024 నుంచి అమల్లోకి రానుంది. పెరిగిన డీఏ ఏప్రిల్ నెలలో ఉద్యోగులకు అందనుంది. అదే సమయంలో డీఏతో పాటు హెచ్ఆర్ఏ కూడా భారీగా పెరగనుంది. హెచ్ఆర్ఏ వివిధ స్థాయిలను బట్టి 10, 20, 30 శాతంగా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉద్యోగుల డీఏ ఎప్పుడైతే 50 శాతం దాటుతుందో సహజంగానే హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది. జనవరి నెల నుంచి వర్తించేలా తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 4 శాతం పెరిగి 50 శాతానికి చేరుకుంది. దాంతో హెచ్ఆర్ఏ పెరగడం అనివార్యమైంది. సదరు ఉద్యోగి నివసించే ఊరిని బట్టి హెచ్ఆర్ఏ 10 శాతం, 20 శాతం, 30 శాతంగా ఉంటుంది. హెచ్ఆర్ఏ కూడా పెరిగిన డీఏతో పాటు అంటే జనవరి 2024 నుంచి అమల్లోకి వస్తుంది. 


హెచ్ఆర్ఏలో అత్యధికంగా పెంపు 3 శాతం ఉంటుంది. గరిష్టంగా 27 శాతం ఉంటే 3 శాతం పెరగగా 30 శాతానికి చేరుకుంది. డీఏ 50 శాతం దాటితే నగరాల కేటగరీ ఎక్స్ , వై, జెడ్ ఆధారంగా హెచ్ఆర్ఏ 10 శాతం లేదా 20 శాతం లేదా 30 శాతం ఉంంటుంది. ఎక్స్ కేటగరీ ఉద్యోగులకు 30 శాతం కాగా, వై కేటగరీకు 20 శాతం, జెడ్ కేటగరీకు  10 శాతం పెరుగుతుంది. 


హెచ్ఆర్ఏ ఎలా లెక్కిస్తారు.


7వ వేతన సంఘం ప్రకారం గ్రేడ్ లెవెల్ 1 ఉద్యోగులకు నెలకు బేసిక్ శాలరీ 56,900 రూపాయలుంటే హెచ్ఆర్ఏ 27 శాతంగా లెక్కిస్తే 15,363 రూపాయలుంటుంది. అదే 30 శాతం పెరిగిన తరువాత అయితే 17,070 రూపాయలవుతుంది. అంటే పెరిగిన హెచ్ఆర్ఏ మొత్తం నెలకు 1707 రూపాయలు. ఏడాదికి 20,484 వేల రూపాయలు.


7వ వేతన సంఘం అమలు చేసినప్పుడు హెచ్ఆర్ఏను 24,18,9 శాతానికి తగ్గించబడింది. ఎక్స్ , వై, జెడ్ అనే మూడు కేటగరీలు కూడా అప్పుడే విభజించారు. డీఏ 25 శాతానికి చేరుకున్నప్పుడు హెచ్ఆర్ఏను 27 శాతం చేయాలని, అదే డీఏ 50 శాతానికి చేరుకున్నప్పుడు హెచ్ఆర్ఏను 30 శాతానికి పెంచాలని నిర్ణయించారు. 


Also read: Apply Voter ID Card: ఓటర్ ఐడీ కార్డు కావాలా, ఇంట్లోంచే ఇలా అప్లై చేయండి చాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook