7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, డీఏతో పాటు ఈ 6 అలవెన్సులు పెంపు
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్. 7వ వేతన సంఘం ప్రకారం ఈసారి ఆరు రకాల పెన్షన్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీనికి సంబంధించిన మెమోరాండం కూడా జారీ అయింది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి డీఏను 4 శాతం పెంచడంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంది. జనవరి నుంచి కొత్త డీఏ ఎరియర్లతో సహా అందుతుంది. డీఏతో పాటు మొత్తం 6 రకాల అలవెన్సులను పెంచుతూ ప్రభుత్వం మొమోరాండం కూడా విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏయే అలవెన్సులను పెంచిందో తెలుసుకుందాం.
చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్
7వ వేతన సంఘం ప్రకారం డీఏ 50 శాతమైతే ఎడ్యుకేషన్ అలవెన్స్ పెంచాలనే ప్రతిపాదన ఉంది. అంటే పిల్లల ఎడ్యుకేషన్ అలవెన్స్ 25 శాతానికి పెరుగుతుంది. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ లేదా హాస్టల్ సబ్సిడీ ఇద్దరు పిల్లలకే వర్తిస్తుంది. హాస్టల్ సబ్సిడీ నెలకు 6750 రూపాయలు. అయితే పిల్లలు వికలాంగులైతే అలవెన్స్ రెట్టింపు ఉంటుంది.
రిస్క్ అలవెన్స్
7వ వేతన సంఘం ప్రకారం రిస్క్ అలవెన్స్ కూడా పెరగాల్సి ఉంది. రిస్క్ అలవెన్స్ అనేది క్లిష్టమైన పనులు చేసే ఉద్యోగులకే ఉంటుంది. లేదా చేసే ఉద్యోగం ఆరోగ్యంపై ప్రతికూల ప్రబావం చూపిస్తే రిస్క్ అలవెన్స్ వర్తిస్తుంది.
నైట్ డ్యూటీ అలవెన్స్
నైట్ డ్యూటీ అలవెన్స్ అనేది 7వ వేతన సంఘం ప్రకారం పెరుగుతుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ డూటీ చేస్తే నైట్ డ్యూటీ అలవెన్స్ వర్తిస్తుంది. ప్రతి గంట రాత్రి డ్యూటీకు పది నిమిషాలు వెయిటేజ్ ఇస్తారు. నైట్ డ్యూటీ అలవెన్స్ పొందాలంటే నెలకు 43,600 రూపాయలు జీతం ఉండాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఓవర్ టైమ్ అలవెన్స్ కూడా ఉంటుంది. ఇక పార్లమెంట్ అసిస్టెంట్లకు ప్రత్యేక అలవెన్స్ ఉంటుంది. వికలాంగ మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా ఛైల్డ్ కేర్ అలవెన్స్ ఉంటుంది.
Also read: Rain Alert: ఏపీలో రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook