Electric Scooter: సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని రేంజ్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
పెరిగిన పెట్రోల్.. డీజిల్.. గ్యాస్ ధరలతో విసిగెత్తిన వారు ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్తగా రగ్గడ్ నుండి వచ్చిన జీ1 మంచి ఫీచర్లతో పాటు మైలేజ్ కూడా ఎక్కువే. ఆ వివరాలు..
Electric Scooter: పెట్రోల్.. డీజిల్.. గ్యాస్ వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాల యొక్క డిమాండ్ ఈమధ్య కాలంలో బాగా పెరిగింది. కాస్త ఎక్కువ రేటు అయినా కూడా ఫ్యూయల్ ఖర్చు తగ్గుతుంది అనే ఉద్దేశ్యంతో చాలా మంది ఈవీ లకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకే అమెరికా వంటి దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈవీ లు ఇప్పుడు ఇండియాలో కూడా మెజార్టీ మార్కెట్ ను దక్కించుకుంటున్నాయి.
అయితే ఈవీ ల్లో ఎక్కువ శాతం మంది రేంజ్ ను చూస్తున్నారు. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ఈవీ పై ప్రయాణించవచ్చు అనేదాన్ని బట్టి ఎంపిక చేసుకుంటున్నారు. అత్యధిక రేంజ్ ఇచ్చే వాహనాలకు మంచి మార్కెట్ ఉంది. టూ వీలర్స్ లో అత్యధిక రేంజ్ ఇచ్చే ఈవీ గా రగ్గడ్ జీ1 నిలువబోతుంది అంటూ సదరు కంపెనీ ప్రకటించింది.
ఏకంగా 160 కిలోమీటర్ల రేంజ్ తో ఈ వాహనంను మార్కెట్ లోకి తీసుకు రాబోతున్నట్లుగా రగ్గడ్ జీ1 కంపెనీ ప్రకటించింది. అధిక పవర్ అవుట్ పుట్ ను అందించడంతో పాటు బ్యాటరీ సింగిల్ చార్జ్ పై ఏకంగా 160 కిలో మీటర్ల రేంజ్ ను అందిస్తుంది. ఈవీ ల యొక్క మెయిన్ సమస్య రేంజ్. దూర ప్రయాణాలకు వెళ్తే అక్కడ చార్జింగ్ పాయింట్స్ లేకుంటే ఇబ్బంది.
అందుకే రేంజ్ ఎక్కువ ఉన్న వాహనాలను చూసుకుంటూ ఉన్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోపెడ్ ను పోలి ఉన్నప్పటికి సూపర్ పవర్ ఉన్న వాహనం అంటూ కంపెనీ వారు పేర్కొన్నారు. బైక్స్ తో పోల్చితే స్కూటర్లకే ఎక్కువగా ఈవీ మార్కెట్ ఉందనే ఉద్దేశ్యంతో రగ్గడ్ జీ1 కంపెనీ కూడా స్కూటర్ మోడల్ లోనే కొత్త బండ్లను తీసుకు వచ్చింది.
Also Read: Toyota Hyryder Price Hike 2023: 60 వేలు పెరిగిన టయోటా హైరైడర్ ధర.. కొత్త ధరల జాబితా ఇదే!
సాధారణంగా ఈవీలు గరిష్ట వేగం 50 నుండి 60 కిలో మీటర్లు మాత్రమే అంటూ కొందరు భావిస్తూ ఉంటారు. కానీ ఈ వాహనం యొక్క గరిష్ట వేగం 75 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. ఇది సిటీ రోడ్లతో పాటు గ్రామీన రోడ్ల పై కూడా మంచి రేంజ్ ను ఇస్తుందని పేర్కొన్నారు. 1500 వాట్ల సామర్థ్యంతో బీఎల్‌డీసీ మోటర్ ఉంటుంది. దాంతో ఎత్తు పల్లాలను లక్ష్య పెట్టకుండా ఈజీగా ముందుకు సాగిపోతుంది.
అలాగే వెయిట్ విషయంలో కూడా ఇతర ఈవీ లతో పోల్చితే రగ్గడ్ జీ1 స్కూటర్ మేటి వాహనంగా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ముందు ముందు ఇండియన్ మార్కెట్ లో ఈ సరికొత్త ఈవీకి మంచి మార్కెట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: 2023 Budget SUVs: 10 లక్షల లోపు 8 ఎస్‌యూవీలు.. పంచ్, నెక్సాన్, బ్రెజాతో సహా కార్ల జాబితా ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.