Aadhaar Card Update: అధార్. దేశంలో అన్నింటికీ ఇదే ఇప్పుడు ఆధారం. వివిధ రకాల ప్రభుత్వ, ప్రైవేటు పనులకు కావల్సిన కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. ప్రభుత్వ పథకాల లబ్ది పొందాలన్నా..బ్యాంకు ఎక్కౌంట్ తెరవాలన్నా..స్కూల్, కళాశాలల్లో ప్రవేశానికి, ఆస్థి కొనుగోలుకు అన్నింటికీ ఇదే ఆధారం. డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ అప్లై చేయాలన్నా ఆధార్ కీలకం. అందుకే ఆధార్ కార్డులో వివరాలు సక్రమంగా ఉండాలి. అందుకే ఏదైనా తప్పులు లేదా పొరపాట్లుంటే సరిచేసుకునే అవకాశం కల్పిస్తోంది యూఐడీఏఐ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధార్ కార్డులో మీ పుట్టిన తేదీ వివరాలు అప్‌డేట్ చేయాలంటే యూఐడీఏఐ ఓ సులభమైన ప్రక్రియను అందిస్తోంది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ వివరాలు అప్‌డేట్ చేయాలంటే ఇలా చేయాలి. 


ముందుగా సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి. ఆధార్ అప్‌డేట్ దరఖాస్తు పూర్తి చేసి మీ పుట్టినతేదీ వివరాలు ఇవ్వాలి. పుట్టినతేదీ ధృవీకరణ పత్రాన్ని జత చేసి ఇవ్వాలి. మీ గుర్తింపు నిర్ధారించేందుకు బయోమెట్రిక్ నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. యూఆర్ఎన్ రిసీప్ట్ తీసుకోవాలి. యూఆర్ఎన్ సహాయంతో ఆధార్ కార్డు అప్‌డేట్ అయిందీ లేనిదీ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. 90 రోజుల్లోగా పుట్టినతేదీ వివరాలు ఆధార్ కార్డులో అప్‌డేట్ అవుతాయి.


ఆధార్ కార్డులో పుట్టినతేదీ మార్చేందుకు కావల్సిన డాక్యుమెంట్లు


పాన్‌కార్డు, పాస్‌పోర్ట్, వోటర్ ఐడీ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే ఫోటో గుర్తింపు కార్డు, ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు, వెపన్ లైసెన్స్, ఫోటో క్రెడిట్ కార్డు, ఫోటో బ్యాంక్ ఏటీఎం కార్డ్, ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో కార్డు కిసాన్ ఫోటో పాస్‌బుక్, ఈసీహెచ్‌ఎస్ ఫోటో కార్డు, తహశిల్దార్ జారీ చేసిన ధృవపత్రం, ఫోటో ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్‌లలో ఏదో ఒకటి అవసరమౌతాయి.


Also read: Income tax: మార్చ్ 31లోగా పూర్తి చేయకపోతే ఇన్‌కంటాక్స్ మినహాయింపు వర్తించదు మరి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook