Aadhaar Card: దేశంలో ప్రతి పౌరుడికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డు జారీ చేస్తుంటుంది. ప్రభుత్వం పనులకు, ఆర్ధిక లావాదేవీలకు అవసరమైన బయోమెట్రిక్ , డెమోగ్రఫిక్ సమాచారం అంతా ఆధార్ కార్డులో నిక్షిప్తమై ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధార్ కార్డు చాలా పనులకు అత్యంత కీలకంగా ఉపయోగపడే డాక్యుమెంట్. అందుకే ఆధార్ పోతే ఇబ్బందులు ఉత్పన్నం కావచ్చు. అయితే ఆధార్ కార్డు డూప్లికేట్ చాలా సులభంగా పొందవచ్చు. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో పొందవచ్చు. మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయుంటే యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in/portal నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఆధార్ కార్డు ఎంటర్ చేసి ఓటీపీతో వెరిఫై చేస్తే చాలు. మీక్కావల్సిన ఆధార్ కార్డు పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది. 


అదే విధంగా క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉండే పీవీసీ ఆధార్ కార్డును కూడా ఆర్డర్ చేసుకుని పొందవచ్చు. దీనికోసం 50 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారం రోజుల వ్యవధిలో ఇంటికి చేరుకుంది. వెరిఫికేషన్ కోసం ఆధార్ నెంబర్, ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, వర్చ్యువల్ ఐడీ , మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 


ఆధార్ కార్డు అప్‌డేట్ చేసినప్పుడు ఎలాంటి మార్పు ఉండదు. అదే ఆధార్ నెంబర్ కొనసాగుతుంది. ఎందుకంటే ఆధార్ నెంబర్ అనేది శాశ్వతంగా ఒకటే ఉంటుంది. ఆధార్ కార్డులో అడ్రస్, మొబైల్ నెంబర్, డెమోగ్రఫిక్ డేటా అప్‌డేట్ చేసినప్పుడు అదంతా ఆధార్ డేటాబేస్‌లో చేరుకుంది. 


Also read: LIC Amritbaal policy: ఎల్ఐసీ కొత్త పాలసీ, 5 లక్షలు కడితే మెచ్యూరిటీ తరువాత 13 లక్షలు చేతికి



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook