Aadhaar Card Update: దేశంలో ప్రతి పౌరునికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డు జారీ చేస్తుంటుంది. ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలతో పాటు బయోమెట్రిక్ సమాచారం కూడా ఉంటుంది. అందుకే ప్రతి పనికీ ఆధార్ ఆదారమౌతోంది. అయితే ఏ వివరాలు ఎన్ని సార్లు కరెక్ట్ చేయవచ్చనే విషయంపై చాలా సందేహాలుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదార్ కార్డు అన్నింటికీ కావల్సిన డాక్యుమెంట్ కావడంతో అందులో ఇచ్చే వివరాలు ఎప్పుడూ సరిగ్గా ఉండాలి. ఒకవేళ ఏమైనా వివరాలు తప్పుుగా ఉంటే వెంటనే వాటిని సరిదిద్దుకోవాలి. అయితే అన్ని వివరాలు ఒకేసారి సరిచేసుకోవాలి. పదే పదే సరి చేసుకునేందుకు వీలుండదు. ఆధార్ కార్డులో మీ పేరు తప్పుగా ఉంటే లేదా మహిళ పెళ్లి తరువాత తన ఇంటి పేరు మార్చుకోవాలనుకుంటే ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ విధానంలో చేసుకోవచ్చు. అయితే ఆధార్ కార్డులో పేరు సరి చేసుకునేందుకు కేవలం రెండు సార్లు మాత్రమే అవకాశముంటుంది. రెండు సార్లు అయిపోతే మూడోసారి చేయడం సాధ్యం కాదు. 


అదే విధంగా జెండర్ మార్పిడి కూడా ఒకసారికే అవకాశముంటుంది. చాలా సందర్భాల్లో సాంకేతిక కారణాలతో తప్పుగా ప్రింట్ అవుతుంటుంది. కేవలం ఒకసారి మాత్రమే తప్పుగా ప్రింట్ అయిన జెండర్ మార్చుకోవచ్చు. ఇక పుట్టిన తేదీ కూడా ఒకసారి మార్చుకునేందుకే అవకాశముంటుంది. ఒకసారి మార్చిన తరువాత మరోసారి అవకాశముండదు. 


అయితే ఆధార్ కార్డులో చిరునామా, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ, ఫింగర్ ప్రింట్, ఫోటో, రెటీనా స్కాన్ అనేవి ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. దీనిపై పరిమితి ఉండదు.


Also read: RGV on Poonam Pandey: నీ వల్లే దేశమంతా చర్చ, నువు చేసింది తప్పు కాదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook