Adani Group FPO: త్వరలో ఎఫ్‌పీవో తీసుకురానున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్, మార్కెట్‌పై ఎలాంటి ప్రభావముంటుంది
Adani Group FPO: అదానీ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్‌లో ఎఫ్‌పీవో ప్రవేశపెట్టనుంది. ఈ ఎఫ్‌పీవో ద్వారా నిఫ్టీలో కీలకమార్పులు రావచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ పరిణామాలేంటి, అసలు ఎఫ్‌పీవో అంటే ఏంటో తెలుసుకుందాం..
అదానీ పేరు గురించి తెలియనివారుండరు. ప్రపంచ కుబేరుల్లో ఒకడైన అదానీ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ నుంచి కీలకమైన పరిణామమిది. త్వరలో కంపెనీ మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్న ఎఫ్‌పీవోపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ ఎఫ్‌పీవో ద్వారా నిఫ్టీలో ఎలాంటి పరిణామాలుంటాయనేది మార్కెట్ నిపుణులు వివరిస్తున్నారు. ఈ ఎఫ్‌పీవో ద్వారా కంపెనీ దాదాపు 20 వేల కోట్లు సమీకరించేందుకు సిద్ధమౌతోంది.
మార్కెట్ నిపుణుల ప్రకారం పేటీఎం, నాయకా, జొమాటో ఐపీవోలతో ఇప్పటికే మార్కెట్ టాప్‌లో ఉంది. ఎస్బీఐ సహా చాలా సంస్థల ఐపీవోలు, ఎఫ్‌పీవోలు మార్కెట్‌లో వచ్చాయి. ఈ అన్ని ఎఫ్‌పీవోలు, ఐపీవోలు మార్కెట్‌లో ప్రభావం చూపించనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
చాలా కాలం తరువాత ఎఫ్‌పీవో
అదానీ సంస్థ ఎఫ్‌పీవో చాలా కాలం విరామం తరువాత వస్తోంది. మార్కెట్‌లో ఎక్కువ కాలం బ్రేక్ తరువాత ఎఫ్‌పీవో వచ్చిందంటే దానర్ధం మార్కెట్‌లో బులిష్ అండర్ టోన్ ఉందని..అందుకే ఎఫ్‌పీవో వస్తుందని అంచనా వేయవచ్చు.
నిఫ్టీకు మంచి పరిణామాలు
ఎఫ్ఐఐతో ఇది సబ్‌స్క్రైబ్ అవడమే కాకుండా ముందుకు కొనసాగుతుంది. దాంతోపాటు లిస్టింగ్ కూడా పూర్తవుతుంది. ఈ ఎఫ్‌పీవో గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఈ ఎఫ్‌పీవోతో నిఫ్టీకు మంచి పరిణామాలే ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మార్కెట్‌లో సానుకూల పరిణామాలు
ఎఫ్‌పీవో రావడం వల్ల మార్కెట్ సెంటిమెంట్ బాగుంటుంది. ఈ ఎఫ్‌పీవోతో వచ్చే 10-15 రోజుల వరకూ నిఫ్టీలో మంచి పరిమామాలుంటాయి. ఎఫ్‌పీవో ఎప్పుడు మార్కెట్‌లో వచ్చినా ఆ మార్కెట్ కొద్దికాలం బాగుంటుంది.
అసలు ఎఫ్‌పీవో అంటే ఏమిటి
ఎఫ్‌పీవో అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. దీనిద్వారా ఏ కంపెనీ అయినా డబ్బులు సమీకరిస్తుంది. మార్కెట్‌లో లిస్టింగ్ తరవాత ముందుగా కంపెనీ ఐపీవో ప్రవేశపెడుతుంటుంది. ఆ తరువాత కంపెనీ ఎక్కువ షేర్లు ఇష్యూ చేయాలనుకున్నప్పుడు ఎఫ్‌పీవో ప్రవేశపెడుతుంది.
Also read: Aadhaar Card Download: ఇక ఆధార్ కార్డు డౌన్‌లోడ్ మరింత సులభం, ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook