Adani Group: రోజురోజుకూ పడిపోతున్న అదానీ షేర్లు, బిలియనీర్ జాబితాలో 21వ స్థానానికి పడిపోయిన అదానీ
Adani Group: అదానీ గ్రూప్ షేర్ల పతనం ఇంకా కొనసాగుతోంది. గత 5 రోజుల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 66 శాతం పడిపోయింది. అటు గౌతమ్ అదానీ సంపద కూడా వేగంగా కరుగుతోంది.
అదానీ గ్రూప్ షేర్లో వరుసగా 7వ రోజు కూడా క్షీణత నమోదైంది. ఫలితంగా ఇన్వెస్టర్లలో ఆందోళన పెరుగుతోంది. అదానీ సంపద రోజురోజుకీ క్షీణిస్తుండటంతో టాప్ 20 జాబితా నుంచి వైదొలగిపోయారు. టాప్ 20 ప్రపంచ కుబేరుల జాబితా నుంచి అవుట్ అయిపోయారు.
హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్‌పై ఇంకా కొనసాగుతోంది. ఫిబ్రవరి 3వ తేదీ అంటే వరుసగా 7వ రోజున కూడా షేర్లు లోయర్ సర్క్యూట్‌లో నడుస్తున్నాయి. గత 5 రోజుల్లో అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్లు 66 శాతం పడిపోయాయి. అటు గౌతమ్ అదానీ సంపద విషయాన్ని పరిశీలిస్తే..హిండెన్‌బర్గ్ రిపోర్ట్ అనంతరం ఆదాయం భారీగా క్షీణిస్తుంది. తాజా గణాంకాల ప్రకారం గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల్లో టాప్ 20 నుంచి వైదొలగారు.
20 గంటల్లో 10.7 బిలియన్ డాలర్ల నష్టం
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ సూచిక ప్రకారం గౌతమ్ అదానీ ఆదాయంలో భారీ క్షీణత నమోదైంది. ఫలితంగా గౌతమ్ అదానీ బిలియనీర్ల జాబితాలో 21వ స్థానానికి చేరిపోయారు. అతని సంపద ఇప్పుడు భారీగా తగ్గిపోయి..61.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది. గత 24 గంటల్లో అదానీ గ్రూప్ సంపాదన 10.7 బిలియన్ డాలర్లు నష్టపోయింది.
2023 ప్రారంభం నుంచి అదానీ చుట్టూ వివాదం
గౌతమ్ అదానీ నిన్న అంటే ఫిబ్రవరి 3వ తేదీన 64.7 బిలియన్ డాలర్ల ఆదాయంతో 16వ స్థానానికి చేరుకున్నారు. గత 24 గంటల్లో 5 స్థానాలు పడిపోయి..ఇప్పుడు 21వ స్థానానికి పడిపోయారు. అటు గత ఏడాది అంటే 2022లో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌లో ఉన్నారు. 2023 ప్రారంభం నుంచి అదానీ చిక్కుల్లోనే ఉన్నారు.
10 రోజుల్లో 59.2 బిలియన్ డాలర్లు కోల్పోయిన అదానీ
2023లో గౌతమ్ అదానీకి జరిగిన నష్టాన్ని ఓసారి పరిశీలిస్తే..ఇప్పటి వరకూ ఆయన సంపద 59.2 బిలియన్ డాలర్లు పడిపోయింది. గత 10 రోజుల్లోనే 52 బిలియన్ డాలర్ల సంపాదనను కోల్పోయారు.
35 శాతం తగ్గిన షేర్ విలువ
అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్లు పతనం కూడా ఇంకా కొనసాగుతోంది. కంపెనీ షేర్లతో ఇవాళ 35 శాతం క్షీణత కన్పించింది. ఇవాళ కంపెనీ స్టాక్ 547.80 రూపాయలు పడిపోవడంతోప్రస్తుతం 1,017.45 రూపాయలకు ట్రేడ్ అవుతోంది.
ఎన్ఎస్ఈ కీలక నిర్ణయం
అదానీ గ్రూప్‌కు సంబంధించిన ఎన్ఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. షేర్లు భారీగా తగ్గడం, పెరగడాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆదానీ పోర్ట్ ఎఫ్ అండ్ ఓ స్టాక్ కొనుగోలుపై ఎన్ఎస్ఈ నియంత్రణ విధించింది. అదానీ పోర్ట్, అదానీ ఎంటర్‌ప్రైజస్‌లు ఇప్పుడు నిఘా పర్యవేక్షణలో ఉంటాయి. వాటి షేర్లపై నిఘా కొనసాగుతుంది. హిండెన్‌బర్గ్ నివేదిక తరువాత అదానీ ఎంటర్‌ప్రైజస్ పరిస్థితి చాలా దారుణంగా మారింది.
Also read: Mahindra Thar 5 Door: కొత్త మహీంద్రా థార్ 5 డోర్ వెర్షన్‌పై తాజా అప్‌డేట్స్, ఇంజన్ ఫీచర్లు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook