Reliance Jio: యూజర్లకు రిలయన్స్ జియో షాక్- ఛార్జీలు పెంచుతూ నిర్ణయం
Reliance Jio: ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాల బాటలో రిలయన్స్ జియో కూడా యూజర్లకు షాకిచ్చింది. ప్రీపెయిడ్ టారీఫ్‌లను పెంచుతూ నిర్ణయించింది.
Reliance Jio has increased its tariffs: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కూడా యూజర్లకు షాకిచ్చింది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా బాటలో.. ఛార్జీలు పెంచుతున్నట్లు ఆదివారం (Jio hike Charges) ప్రకటించింది. కొత్త ఛార్జీలు డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.
కొత్త ఛార్జీలు ఇలా..
ప్రస్తుతం ఉన్న ఛార్జీలతో పోలిస్తే.. 20 శాతం పెంపు ఉంటుందని రిలయన్స్ (Reliance Jio hike Tariff) పేర్కొంది.
జియో బేసిక్ ప్లాన్‌ను రూ.75 నుంచి రూ.91కి పెంచింది. అయితే ప్లాన్ ప్రయోజనాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీతో 3జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 50 ఎస్ఎంఎస్లు పొందొచ్చు.
అన్లిమిటెడ్ ప్లాన్స్‌లో మార్పులు ఇలా..
రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్‌తో కూడిన 28 రోజుల ప్లాన్ (Jio New plans) ధరను రూ.199 నుంచి రూ.239కి పెంచింది. ఇవే ఫీచర్లతో రోజుకు 2జీబీ డేటా వచ్చే ప్లాన్‌ను రూ.249 నుంచి రూ.299కి పెంచినట్లు తెలిపింది.
84 రోజలు వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు అపరిమిత కాలింగ్ సదుపాయం (Jio Unlimited plans) ఉండే ప్లాన్ ధరను రూ.555 నుంచి రూ.666కి పెంచింది జియో. ఇందులోనే రోజుకు 2 జీబీ డేటా అందించే ప్లాన్ ధరను రూ.599 నుంచి రూ.719కి పెంచినట్లు పేర్కొంది.
వార్షిక ప్లాన్ (365 రోజులు) ధరను రూ.2,399 నుంచి రూ.2,879కి పెంచింది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత కాల్స్ అందుతాయి.
యాడ్ ఆన్ రీఛార్జ్‌ల ధరలను (6జీబీ డేటా) రూ.51 నుంచి రూ.61కి పెంచింది. 12 జీబీ డేటా యాడ్ ఆన్ రీఛార్జ్ ధరను రూ.101 నుంచి రూ.121కి, 50 జీబీ డేటా యాడ్ ఆన్ రీఛార్జ్ ధరను రూ.251 నుంచి రూ.301కి పెంచుతున్నట్లు తెలిపింది జియో.
Also read: Mcap lose: ఐదు రోజులు, 9 కంపెనీలు, నష్టం రూ.2.62 లక్షల కోట్లు!
Also read: November 30 Deadline: నవంబర్ ముగుస్తోంది.. ఈ పనులు పూర్తి చేశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook