హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్‌ను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల జాబితాలో టాప్ 20 నుంచి వైదొలగిన అదానీ..ఇప్పుడు ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో కూడా లేకపోవడడం గమనార్హం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావంతో అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న శుక్రవారం కూడా షేర్ల పతనం కొనసాగింది. హిండెన్ బర్గ్ నివేదిక జనవరి 25వ తేదీన వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకూ అంటే ఇంకా నెలరోజులు పూర్తి కాకుండానే అదానీ సామ్రాజ్యం విలువ పడిపోతోంది. హిండెన్‌బర్గ్‌కు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలకు సిద్ధమౌతోంది అదానీ గ్రూప్. కానీ అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల పతనం మాత్రం ఆగడం లేదు. గత వారం అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు కొద్దిగా పెరిగినా..తిరిగి నిన్న శుక్రవారం షేర్లు పడిపోయాయి. హిండెన్‌బర్గ్ తరువాత రేటింగ్ ఏజెన్సీలు, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి సైతం అదానీ గ్రూప్‌కు షాక్ తగిలింది. దాంతో అదానీ సంపద భారీగా క్షీణిస్తోంది. 


అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో క్షీణత ఇంకా కొనసాగుతోంది. ఫలితంగా అదానీ నెట్‌వర్త్ సంపద ఇప్పుడు 58 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఒక్కరోజులోనే 2.4 బిలియన్ డాలర్లు తగ్గడం విశేషం. అంటే 60 బిలియన్ డాలర్ల నుంచి 58 బిలియన్ డాలర్లకు పడిపోయింది ఆయన సంపద. ఫలితంగా ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ జాబితాలో 17వ స్థానం నుంచి పడిపోయి..22వ స్థానానికి వచ్చేశారు. 150 బిలియన్ డాలర్లతో ఇదే జాబితాలో కొద్దిరోజుల క్రితం రెండవ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ..ఇప్పుుడు 22వ స్థానానికి పడిపోయారు. 


అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీగా భావించే..అదానీ ఎంటర్‌ప్రైజస్ 4.28 శాతం వరకూ పడిపోయింది. హిండెన్‌బర్గ్ నివేదిక తరువాత ఇండెక్స్ ప్రొవైడర్ ఎంఎస్‌సిఐ కూడా అదానీ గ్రూప్‌కు చెందిన 4 షేర్లలో ఫ్రీ ఫ్లోట్ స్టేటస్ తగ్గించింది. ఫలితంగా ఈ సూచీలో కంపెనీ ప్రాధాన్యత తగ్గిపోయింది. దాంతో షేర్లు మరోసారి పడిపోయాయి. అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ 100 బిలియన్ డాలర్లకు పైగా పడిపోయింది. 


Also read: Tata Punch: 1 లక్ష రూపాయలు చెల్లించి టాటా పంచ్ మీ సొంతం చేసుకోండి ఇలా



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook