Tata AirIndia: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్​ఇండియాను.. భారత ప్రభుత్వం నేడు (జనవరి 27) అధికారికంగా టాటా గ్రూప్​కు (Air India handed over to Tata Group) అప్పగించింది. దీనితో దాదాపు 69 ఏళ్ల తర్వాత ఎయిర్ఇండియా తిరిగి సొంత గూటికి చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎయిర్​ఇండియాను టాటా గ్రూప్​కు అప్పగించినప్పటికీ.. తక్షణమే టాటా గ్రూప్​ కింద ఎయిర్​ఇండియా విమానాలు నడవవని అధికారులు వెల్లడించారు.


ఎయిర్​ఇండియాను అధికారికంగా టాటా గ్రూప్​కు అప్పగించే ప్రక్రియలో భాగంగా.. టాటా సన్స్​ ఛైర్మన్​ చంద్రశేఖరన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ ఒప్పందంపై చర్చించారు.



ఎయిర్​ ఇండియా, డిపార్ట్​మెంట్​ ఆఫ్ ఇన్వెస్ట్​మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్​మెంట్​ (దీపమ్​) కార్యదర్శి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో కూడా భేటీ అయ్యారు చంద్రశేఖరన్​. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్​ ద్వారా ఎయిర్ ఇండియా షేర్ (Air India latest news)​ చేసింది.


టాటా సన్స్​కు చెందిన పూర్తి స్థాయి అనుబంధ సంస్థ Talace (ట్యాలెస్​) ద్వారా ఎయిర్​ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్​ప్రెస్​, ఎయిర్​ ఇండియా ఎస్​ఏటీఎస్​ ఎయిర్​పోర్ట్​ సర్వీసెస్​ స్వాధీన ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్​ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర (Tata group Air India deal) వేసింది.


ఇక ఎయిర్​ ఇండియా తిరిగి సొంత గూటికి చేరుతుండటంపై టాటా గ్రూప్​ కూడా హర్షం వ్యక్తం చేసింది. 'నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం' అంటూ (Tata group on Air India) ట్వీట్ చేసింది.



ఒప్పందం ఇలా..


ఎయిర్​ ఇండియాను విక్రయించేందుకు గత ఏడాది బిడ్లను ఆహ్వానించగా.. టాటా గ్రూప్​ దాని అనుబంధ సంస్థ ట్యాలెస్ ద్వారా బిడ్​ దాఖలు చేసింది.  2021 అక్టోబర్ 8న బిడ్లకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం. రూ.18,000 కోట్లకు ఎయిర్​ఇండియాలో 100 శాతం వాటాను కొనుగోలు (Tata Gorup Air India deal value) చేసింది టాటా గ్రూప్​. ఈ మరేకు గత ఏడాది అక్టోబర్​ 25నే కేంద్రం షేర్ పర్చేస్​ ఒప్పదంపై సంతకాలు చేసింది.


ఈ ఒప్పందంలో భాగంగా ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​ను కూడా టాటా గ్రూప్​కు అప్పగించింది. దీనితో పాటు గ్రౌండ్​ కార్యకలపాలు నిర్వహించే ఎయిర్​ఇండియా ఎస్​ఏటీఎస్​లో 50 శాతం వాటా టాటా గ్రూప్​కు (Air India privatisation news) దక్కింది.



ఎయిర్ ఇండియా చరిత్ర..


1932లో తొలిసారిగా టాటా గ్రూప్​ ఇండియాలో ఎయిర్​లైన్స్​ను స్థాపించింది. అప్పటి టాటా గ్రూప్ ఛైర్మన్ జేఆర్​డీ టాటా ఆధ్వర్యంలో ఇది విజయవంతంగా నడిచింది. అయితే 1953లో జాతీయీకరణలో ఎయిర్​ ఇండియా (Air India history) పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లింది.


చాలాకాలం విజయవంతంగా నడిచిన ఎయిర్​ఇండియా.. దాదాపు పదేళ్ల క్రితం నష్టాలను నమోదు చేస్తూ వస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ప్రభుత్వ నిధులు లేనిదే కనీసం సంస్థ కార్యకలాపాలు సాగించలేని స్థితికి (Air India debts) చేరుకుంది.


దీనితో 2018 నుంచి ఎయిర్​ ఇండియాను విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు (Air India for sale) పెట్టింది. అయితే తొలి ప్రయత్నంలో ఎవరూ ముందుకు రాకపోవడంతో.. సంస్థలో వంద శాతం వాటా విక్రయించాలని 2020లో నిర్ణయించింది. కొవిడ్ కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైంది.


ఎట్టకేలకు గత ఏడాది అక్టోబర్​లో ఇందుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. ఇప్పుడు దాదాపు 7 దశాబ్ధాల తర్వాత మహారాజ (ఎయిర్​ ఇండియా) తిరిగి సొంత గూటికి (Air India to part in Tata group) చేరుతోంది.


Also read: Stock Market today: స్టాక మార్కెట్లకు మళ్లీ నష్టాలు- ఐటీ షేర్లు కుదేలు..!


Also read: Jio Recharge Plan: జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. రూ.150లకే అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook