Airtel launches 5G Plus Services in 8 cities across India: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ తమ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. భారత దేశంలోని 8 నగరాల్లో 5జీ ప్లస్‌ సేవలను ఆరంభించింది. 5జీ సేవలను పొందేందుకు సిమ్‌ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5జీ ఫోన్‌ ఉంటే చాలని ఎయిర్‌టెల్‌ స్పష్టం చేసింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, సిలిగుడి, నాగ్‌పూర్‌, వారణాశి నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక దేశవ్యాప్తంగా దశల వారీగా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఉన్న వేగం కంటే 20 నుంచి 30 రెట్ల అధిక వేగంతో 5జీ ప్లస్‌ సేవలు పొందొచ్చని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేంత వరకు 4జీ ప్లాన్లతోనే హై స్పీడ్‌ డేటాను ఎంజాయ్ చేయొచ్చని తెలిపింది. 5జీ ఫాన్స్ అన్ని ఎయిర్‌టెల్‌ 5జీకి సపోర్ట్‌ చేయకపోవచ్చని ఎయిర్‌టెల్‌ చెప్పింది. ఇందుకు సంబంధించి మొబైల్‌ తయారుదారులు ఓటీఏ అప్‌డేట్‌ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. 


మరోవైపు దసరా పండగ నేపథ్యంలో అక్టోబర్‌ 5 నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ట్రయల్‌ బేసిస్‌పై 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు మరో ప్రముఖ టెలికాం సంస్థ జియో ప్రకటించింది. జియో ట్రూ 5జీ వెల్‌కం ఆఫర్‌ కింద నాలుగు నగరాలలో జియో యూజర్లకు బీటా ట్రయల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆఫర్‌ కింద జియో యూసర్లు 5జీ అన్‌లిమిటెడ్‌ డేటాను 1 జీబీపీఎస్‌ వేగంతో పొందవచ్చు. 


Also Read: ఆ పేసర్ టీ20 ప్రపంచకప్‌ భారత జట్టులో లేకపోవడంతో షాక్ అయ్యా: బ్రెట్‌ లీ


Also Read: మొరిగే ప్రతి కుక్కపై రాళ్లు వేసేందుకు ఆగితే.. విమర్శలకు జస్ప్రీత్ బుమ్రా కౌంటర్‌!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook