Airtel Prepaid Recharge Plans: టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ చివరకు తన అధికారిక వెబ్‌సైట్ నుండి మూడు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను తొలగించింది. అదే సమయంలో మరో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.279 మరియు రూ.179 మరియు రూ.45 స్మార్ట్ రీఛార్జ్ ప్యాక్‌లను ఎయిర్‌టెల్ తొలగించింది. ఎయిర్‌టెల్ కొత్తగా రూ.128 రీఛార్జ్ ప్లాన్‌ను తన వినియోగదారుల కోసం తీసుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎయిర్‌టెల్ రూ.279 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో వినియోగదారులకు ప్రతిరోజూ 1.5జీబీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 28 రోజులు. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు, ఇతర ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాలింగ్‌(Unlimited Calling) సౌకర్యాన్ని కల్పించింది. ఎయిర్‌టెల్ తొలగించిన మరో ప్లాన్ రూ .179 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. 2 జీబీ డేటా, మరియు 300 ఎస్ఎంఎస్ (Airtel Offers) లభిస్తాయి. వీటితో పాటు రూ.2 లక్షల విలువైన భారతి ఆక్సా జీవిత బీమాను అందిస్తుంది. 


ఎయిర్‌టెల్ రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారులకు రోజుకు 1.5 జీబీ డేటా అందిస్తుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు.  ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ (Airtel unlimited prepaid plans) ద్వారా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ (Airtel Xstream), వింక్ మ్యూజిక్‌(Wynk Music)లో ఫ్రీగా హలో ట్యూన్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకనెల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఫాస్ట్‌టాగ్ లావాదేవీలపై రూ.150 వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.


ఎయిర్‌టెల్ రూ.128 రీఛార్జ్ ప్లాన్
రూ.45 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తొలగించిన ఎయిర్‌టెల్ సరికొత్తగా రీఛార్జ్ ప్లాన్ రూ.128ను తీసుకొచ్చింది. దీని ద్వారా వినియోగదారులకు ఎలాంటి టాక్‌టైమ్ లేదా డేటా బెనిఫిట్స్ అందవు. లోకల్ మరియు ఎస్‌టీడీ కాల్స్ సెకనుకు 2.5 పైసలు చొప్పున వసూలు చేస్తుంది. ఎస్ఎంఎస్ రేట్లు రూ.1 మరియు రూ.1.5 అని, 28 రోజుల వ్యాలిడిటీతో ఆఫర్ తీసుకొచ్చింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook