Airtel Postpaid Family Plan 999: ఒకప్పుడు కాల్ మాట్లాడాలన్నా లేదా డేటా వినియోగించుకోవాలన్నా భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చేది. ఎయిర్ టెల్, ఐడియా, వోడా ఫోన్ టెలికాం సంస్థలు అడపాదడపా మాత్రమే ఆఫర్లు ప్రకటించేవి. ఆ సమయంలో ప్రముఖ టెలికాం సంస్థ 'జియో' రంగంలోకి దిగాక వినియోగదారులకు భారీగా ఊరట లభించింది. అపరిమిత కాల్స్, డేటా అందించడంతో.. మిగతా సంస్థలు కూడా తమ కస్టమర్లను  ఆకట్టుకునేందుకు ఆఫర్లు ప్రకటించాయి. ఇప్పటికీ అది కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ తమ పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం తాజాగా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 999లకే మూడు పోస్ట్ పెయిడ్ కనెక్షన్లను పొందవచ్చు. ఈ ఆఫర్‌లో మూడు పోస్ట్ పెయిడ్ కనెక్షన్ల వినియోగదారులు నెల రోజుల పాటు అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చు. కుటుంబ సభ్యుల కోసం రెండు ఉచిత యాడ్-ఆన్ సాధారణ వాయిస్ కనెక్షన్లు ఇచ్చారు. 100 మెసేజ్‌లను, 150 జీబీ డేటాను కూడా పొందవచ్చు. రోజు 100 మెసేజ్‌ల కంటే ఎక్కువ వినియోగిస్తే.. ఒక్కో మెసేజ్‌కు 10పైస అదదంగా పడుతుంది.


ఈ ఆఫర్‌లో అమెజాన్ ప్రైమ్, డిస్ని ప్లస్ హాట్ స్టార్ సభ్యత్వం కూడా ఒక సంవత్సరం పాటు ఫ్రీగా పొందవచ్చు. హ్యాండ్‌సెట్ రక్షణ, షా అకాడమీ లైఫ్‌టైమ్ యాక్సెస్, జగ్గర్‌నాట్ పుస్తకాలు, Airtel X-stream App ప్రీమియం మరియు వింక్ ప్రీమియం కూడా అందుబాటులో ఉంది. ఎయిర్ టెల్ అందించిన ఈ బంపర్ ఆఫర్‌ను వెంటనే పొందాలంటే.. ఈరోజే పోస్ట్ పెయిడ్‌కు మారండి. https://www.airtel.in/myplan-infinity/submit-form ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు. పేరు, మొబైల్ నంబర్, కేవైసీ, ఇంటి అడ్రెస్ సమర్పిస్తే చాలు రూ.999ల ఆఫర్ పొందవచ్చు. 


Also Read: Viral Video: బాంబులు ప్రయోగిస్తున్న మొక్క.. నమ్మశక్యంగా లేదా.. అయితే ఈ వీడియో చూడండి


Also Read: Rohit Sharma Challenge: ఈ ఛాలెంజ్ గెలవండి.. రోహిత్ శర్మతో లైవ్‌‌లో మాట్లాడే అవకాశం పొందండి!!


 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook