PF Balance: ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. అదే సమయంలో పొదుపు చేయమని ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా అనేక పథకాలు అమలు చేస్తోంది. వీటిలో ఒక పథకం ఈపీఎఫ్ కూడా ఉంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీల కోసం అమలు చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ పథకం పేరుతో చాలా మంది దుండగులు వినియోగదారులను  కూడా మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మోసాన్ని అరికట్టేందుకు ఈపీఎఫ్ఓ హెచ్చరిక జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ పథకాల ఆధారంగా ప్రజలను కేటుగాళ్లు మోసం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధార్ అప్‌డేట్ చేయాలని.. పాన్ కార్డు లింక్ చేయాలని వివిధ పేర్లతో నిత్యం మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ అలర్ట్ అయింది. ఈపీఎఫ్‌వో పేరుతో దుండగులు ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపింది. ఆన్‌లైన్ కేటుగాళ్ల పట్ల జాగ్రత్త వహించాలని కోరింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. 


 




ఈపీఎఫ్ఓ సభ్యులను ఫోన్, సోషల్ మీడియా, వాట్సాప్ మొదలైన వాటి ద్వారా ఆధార్, పాన్, యూఏఎన్, బ్యాంక్ ఖాతా లేదా ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ అడగదని ఈపీఎఫ్ ట్విట్టర్‌లో పేర్కొంది. వాట్సాప్, సోషల్ మీడియా మొదలైన వాటి ద్వారా ఏదైనా సేవ కోసం డబ్బును డిపాజిట్ చేయమని కోరమని స్పష్టం చేసింది. పీఎఫ్ ఖాతాదారులు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి మీకు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే ఎప్పుడు స్పందించకండి. అదేవిధంగా లింక్‌లు పంపించి క్లిక్ చేయమంటే అస్సలు చేయకండి. తెలియని నంబర్ల నుంచి కాల్ వస్తే.. వెంటనే కట్ చేయడం బెటర్.


Also Read: Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు.. బీఆర్ఎస్‌లో కలకలం


Also Read: చప్పట్లు కొట్టించుకునేందుకు ఏదేదో మాట్లాడుతున్నాడు కానీ అంతా అక్కడి స్క్రిప్టే!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి