Alibaba's Jack Ma's loss in China: న్యూఢిల్లీ : చైనాకు చెందిన ఇ-కామర్స్‌ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జాక్‌ మాకు బారీ నష్టం వాటిల్లింది. ఒక ఏడాది కాలంలోనే జాక్ మా మార్కెట్‌ విలువలో 344 బిలియన్‌ డాలర్ల నష్టం చేకూరింది. అంటే భారతీయ కరెన్సీలో రూ.25 లక్షల కోట్లు అన్నమాట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏడాది క్రితం చైనా సర్కార్‌కి వ్యతిరేకంగా చైనా ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు (Jack Ma's remarks) ఆయనకు ఈ నష్టం తీసుకొచ్చాయి. చైనా ఆర్థిక వ్యవస్థపై జాక్ మా చేసిన వ్యాఖ్యలు అక్కడి చైనా ప్రభుత్వానికి, ఇన్వెస్టర్లకు కోపం తెప్పించాయి. దీంతో స్టాక్‌ మార్కెట్లలో అలీబాబా షేర్లు వరుసగా కిందకు పడిపోతూ వచ్చాయి. ఫలితంగా అలీబాబా గ్రూప్‌ సంపదతో పాటు జాక్‌ మా నికర సంపద కూడా తరిగిపోతూ వచ్చింది. 


జాక్ మా (Jack Ma net worth) తరహాలో ప్రపంచంలో ఏ బిలియనీర్ కూడా కేవలం ఒక ఏడాది కాలంలోనే ఇంత భారీగా నష్టపోలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.