Amazon AC Sale: సమ్మర్ వచ్చేస్తోంది.. రూ.4,687 ధరకే ఎయిర్ కండిషనర్.. ఈరోజే తుదిగడువు!
Amazon AC Sale: రాబోయే సమ్మర్ కోసం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్స్ ను ప్రకటిస్తున్నాయి. అమెజాన్ నిర్వహిస్తున్న సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్ట్ అనే సేల్ లో రూ. 4,687 ధరకే ఎయిర్ కండిషన్ ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. అదెలాగో ఈ స్టోరీ చదివి తెలుసుకోండి.
Amazon AC Sale: మరికొద్ది రోజుల్లో ఫిబ్రవరి నెల ముగియనుంది. ఆ తర్వాత మార్చి నెలాఖరు నుంచి వేసవి కాలం రానుంది. ఇప్పటికే రాత్రుళ్లు చలిగాలులు తగ్గాయి. అదే విధంగా రాత్రివేళ ఉష్ణోగ్రతలు క్రమంగా కొనసాగుతున్నాయి. వేసవి కాలం త్వరలోనే రానుందని వాతావరణ మార్పులను బట్టి తెలుస్తోంది. దీంతో రాబోయే కాలం మరింత వడగాలులు రానున్నాయని వాతావరణ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వేడి గాలుల నుంచి మనల్ని మనం తప్పించుకోవడానికి ఎయిర్ కండిషన్ లేదా ఎయిర్ కూలర్ కొనేందుకు ప్రజలు ఇంట్రెస్ట్ చూపుతారు.
రాబోతున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్.. సమ్మర్ అప్లయెన్సెస్ పై ప్రత్యేక ఆఫర్లు నడుస్తున్నాయి. సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్ట్ ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు కొనసాగనుంది.
అయితే ఈ ఆఫర్ నేటితో పూర్తి కానుంది. కాబట్టి కస్టమర్లు త్వరపడండి. అమెజాన్ లో హిటాచీ కంపెనీకి చెందిన 1.5 టన్నుల 5 స్టార్ ఎయిర్ కండిషన్ డీల్ గురించి చెప్పబోతున్నాను. ఈ ఏసీని కేవలం రూ.4,687 ధరకే అందుబాటులోకి రానుంది.
రూ. 4,687లకే ఎయిర్ కండిషనర్..
Hitachi కంపెనీకి చెందిన 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఎయిర్ కండిషనర్ పై అమెజాన్ లో ప్రత్యేక తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఏసీ మార్కెట్లో రూ.60,500 ధరకు విక్రయిస్తున్నారు. అయితే హిటాచీ ఏసీపై అమెజాన్ 30 శాతం తగ్గింపు వర్తిస్తుంది. దీంతో ఆఫర్ తర్వాత రూ. 42,180 కొనుగోలు చేయవచ్చు. దీనిపై EMI సదుపాయం కూడా ఉంది.
ఈ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మీకు మరికొంత డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరో రూ. 5,050 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో పాటు ఈ చెల్లింపుపై అనేక బ్యాంకులు ప్రత్యేక ఆఫర్లు అందజేస్తున్నాయి.
హిటాచీ స్ప్లిట్ ఏసీ ఫీచర్లు
హిటాచీ కంపెనీకి చెందిన ఈ 5 స్టార్ ఇన్వర్టర్ స్ల్పిట్ AC OneTouch సైలెంట్ ఫ్యాన్ స్పీడ్ వెసులుబాటు ఉంది. సాఫ్ట్ డ్రై, సూపర్ కూల్, ఆటో ఫ్యాన్ స్పీడ్, ఫ్యాన్ మోడ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. దీనిలో మీరు 5,100X ఇన్వర్టర్‌ని పొందుతారు. ఈ ఎయిర్ కండిషన్ గదిలోని తేమను ఆటోమేటిక్‌గా గ్రహిస్తుంది. కార్డెడ్ ఎలక్ట్రిక్ వైర్‌పై పనిచేసే ఈ ఏసీ.. విద్యుత్తును కూడా ఆదా చేస్తుంది.
Also Read: Amazon Sale: సౌండ్ బార్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లు- పూర్తి వివరాలు ఇవే..
Also Read: Harley Davidson New Electric Bike: హార్లే డేవిడ్సన్ నుంచి మరో ఎలక్ట్రిక్ బైక్.. లాంచింగ్ ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook