Amazon New Sale: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్‌డే సేల్ డేట్ వచ్చేసింది- పూర్తి వివరాలు ఇవే..
Amazon New Sale: అమెజాన్ ఇండియా మరోసారి భారీ డిస్కౌంట్లు ప్రకటించనుంది. `గ్రేట్ రిపబ్లిక్ డే సేల్`ను ప్రారంభించనుంది. ఈ సేల్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Amazon New Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మరోసారి భారీ సేల్‌ను ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సేల్‌ను తీసుకురానుంది. 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' పేరుతో ఈ సేల్ (Amazon Great Republic Day Sale) నిర్వహింనుంది.
సేల్ గురించి మరిన్ని వివరాలు..
ఈ నెల 17 నుంచి 20 వరకు ఈ సేల్ (Amazon Great Republic Day Sale date) కొనసాగనుంది. అమెజాన్ ప్రైమ్ సబ్స్రైబర్లకు మాత్రం ఈ సేల్ 24 గంటల ముందు అంటే 16వ తేదీనే అందుబాటులోకి రానుంది.
అయితే ఎప్పటిలానే స్మార్ట్ఫోన్లు, టీవీలు ఎలక్ట్రానిక్స్, హోం, కిచెన్ అప్లయిన్సెస్పై భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు (Amazon offers on smartphones) తెలిసింది.
స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్ (కెమెరాలు, ల్యాప్‌టాప్‌ల వంటివి)పై 70 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించే వీలుందని (Amazon new sale) సమాచారం.
ఇక పెద్ద సైజు టీవీలు, ఫ్రిడ్జ్‌ల వంటివాటిపై 50 శాతం వరకు డిస్కౌంట్ (Amazon offers on TVs) ఇవ్వనున్నట్లు సమాచారం.
బ్యాంక్ ఆఫర్ కోసం ఈ సారి ఎస్బీఐ కార్డ్స్, అమెజాన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఆఫర్ ప్రకారం.. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ (SBI card offers on Amazon) ఉపయోగించే చేసే కొనుగోళ్లపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభించనుంది.
ఇక బజాజ్ ఫినాన్స్ కార్డ్‌పై నో కాస్ట్ ఈఎంఐని కూడా ఇవనుంది అమెజాన్ (Amazon offer deals) ఇండియా.
స్మార్ట్ఫోన్లపై రూ.16 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇవ్వనున్నట్లు అమెజాన్ ఇండియా పేర్కొంది.
వివిధ మొబైళ్లపై ఆఫర్లు ఇలా..
రెడ్మీ నోట్ 10ఎస్ ధరను రూ.16,999 కన్నా తక్కువకే విక్రయించే వీలుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం12 ధరను రూ.12,999కన్నా (Amazon offers on Samsung phones) దిగువకు తగ్గించే వీలుంది. గేమింగ్ ఫోన్ ఐకూ జెడ్ 3 ధరను రూ.22,990 తక్కువకు విక్రయించే అవకాశాలున్నాయి. త్వరలోనే మోడళ్ల వారీగా ఆఫర్లు ప్రకటించే (Amazon Great Republic Day Sale offers) వీలుంది.
Also read: Stock Market today: స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర- 61 వేల మార్క్‌పైకి సెన్సెక్స్
Also read: Petrol Diesel Update: వాహనదారులకు గుడ్ న్యూస్- 50 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ ఫ్రీగా పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook