Amazon Fab Phones Fest: మొబైల్ ఫోన్లు, టీవీలపై అమెజాన్ అదిరే ఆఫర్లు- రేపే లాస్ట్ ఛాన్స్!
Amazon Fab Phones Fest: ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌లో స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్, ఫాబ్ టీవీ ఫెస్ట్ పేర్లతో ఇస్తున్న ఈ ఆఫర్ రేపటితో ముగియనుంది.
Amazon Fab Phones Fest: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ నెల 25 ఫాబ్ ఫోన్ ఫేస్ట్, ఫాబ్ టీవీ ఫెస్ సేల్‌ను ప్రారంభించింది. ఈ స్పెషల్ సేల్ ఆఫర్లు రేపటితో ముగియనున్నాయి. ఈ సేల్‌లో శాంసంగ్, రియల్మీ, వన్‌ప్లస్, ఐకూ సహా వివిధ బ్రాండ్ల ప్రోడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్ ఇస్తోంది. దీనితో పాటు హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల ద్వారా జరిపే లావాదేవీలకు రూ.1000 తక్షణ డిస్కౌంట్ ఇస్తోంది.
బైల్ ఫోన్లపై ఆఫర్లు ఇవే..
ఈ సేల్‌లో భాగంగా.. వన్‌ప్లస్ ప్రీమియం మోడల్.. వన్‌ప్లస్ 9ఆర్టీ వేరియంట్ ధరను రూ.42,999 నుచి రూ.38,999కి తగ్గించింది.
శాంసంగ్ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో వచ్చిన గెలాక్సీ ఎం 32 మోడల్ ధరనుపై 12 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.16,999 కాగా.. ఈ సేల్‌లో రూ.14,999కే సొంతం చేసుకునే వీలుంది.
గేమ్ లవర్స్కోసం.. ఐకూ 7 5జీ మొబైల్ ఫోన్ ధర రూ.34,990 గాగా.. స్పెషల్ డిస్కౌంట్ కింద రూ.5,000 తగ్గింపు ఇస్తోంది. అంటే ఈ ఫోన్‌ను రూ.29,990కే సొంతం చేసుకునే వీలుంది.
యాపిల్ ఐఫోన్ 12.. 64 జీబీ వేరియంట్‌పై ఏకంగా రూ.11,900కుపైగా తగ్గింపి ఇస్తోంది అమెజాన్. రూ.65,900 విలువైన ఈ ఫోన్ ధరను రూ.53,999కు తగ్గించింది.
రియల్మీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ నార్జో 50ఏ (4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్) ధరను రూ.1,500 తగ్గించి.. రూ.11,499కి విక్రయిస్తోంది అమెజాన్.
రెడ్మీ నోట్ 11ఎస్ స్మార్ట్ ఫోన్‌పై రూ.2000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది అమజాన్. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ ధర రూ.14,499కి తగ్గనుంది.
ఒప్పొ ఏ15ఎస్ మొబైల్ ధరను రూ.13,990 నుంచి రూ.9,990కి తగ్గించింది.
ఇవే కాకుండా వివిధ బ్రాండ్లలోని అన్ని మోడళ్లపై డిస్కౌంట్లు ఇస్తోంది అమెజాన్.
టీవీలపై ఆఫర్లు ఇవే..
శాంసంగ్, ఎల్జీ, వన్‌ప్లస్ సహా వివిధ బ్రాండెడ్ టీవీలపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది అమెజాన్. ఫాబ్ ఫెస్ట్ డిస్కౌంట్లతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే లావాదేవీలకు రూ.5,000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా లభిస్తున్నట్లు తెలిపింది. ఇదే కాకుండా అమెజాన్ కూపన్స్ ద్వారా మరో రూ.1,750 వరకు అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.
ఫాబ్ ఫెస్ట్ ఆఫర్లతో పాటు.. ఎక్స్ఛేంజ్ సదుపాయం ద్వారా మరింత తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్లన్ని రేపు (సోమవారం) అర్థ రాత్రి 12 గంటల వరకే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ధరలు మళ్లీ సాధారణ స్థాయికి వస్తాయి.
Also read: Flipkart Sale: రూ.3,699 ధర గల బటర్‌ఫ్లై మిక్సీ కేవలం రూ.1,222 కే.. త్వరపడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook