Amazon Fab Phones Fest: అమెజాన్ ఆఫర్.. రూ.200 కన్నా తక్కువకే స్మార్ట్ఫోన్లు!
Amazon Fab Phones Fest: అమెజాన్ స్మార్ట్ఫోన్లపై క్రేజీ ఆఫర్లతో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ ప్రారంభించింది. ఈ స్పెషల్ సేల్‌లో కొన్ని ఫోన్లను రూ.200 కన్నా తక్కువకే పొందే వీలుంది. ఆ ఫోన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Amazon Fab Phones Fest: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఈ నెల 10న ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ ప్రారంభించింది. ఈ స్పెషల్ సేల్‌లో భాగంగా అన్ని బ్రాండెడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ఈ నెల 14 వరకు అందుబాటులో ఉండనున్న ఈ సేల్ల్లో.. పలు క్రేజీ డీల్స్ కూడా ఉన్నాయి. ఈ ఆఫర్స్ ద్వారా బ్రాండెడ్ ఫోన్లను రూ.200 కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. మరి ఆ ఫోన్లు ఏవి? అంత తక్కువ ధరకు కొనుగోలు చేయడం ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం?
ఒప్పో ఏ15ఎస్..
64 జీబీ స్టోరేజ్ ట్రిపుల్ రియర్ కెమెరాతో కూడిన ఒప్పొ ఏ15ఎస్ ధర రూ. రూ.13,990 ఉండగా.. ఆఫర్లో రూ.10,990కి విక్రయమవుతోంది. హెచ్ఎస్బీసీ కార్డ్ ద్వారా 5% తక్షణ క్యాష్ బ్యాక్ (రూ.550) పొందవచ్చు. దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.10,250 వరకు ఆదా చేయవచ్చు (ఆఫర్ పూర్తిగా లభిస్తే). దీనితో ఈ మొబైల్‌ను రూ. 190కే దక్కించుకోవచ్చు.
రెడ్మీ 9ఏ స్పోర్ట్..
రూ. 8,499 విలువ ఉన్న రెడ్మీ 9ఏ స్పోర్ట్‌ను.. ఈ సేల్‌లో రూ.6,999కి తగ్గించింది అమెజాన్. హెచ్ఎస్బీసీ కార్డ్‌తో కొనుగోలు జరిపితే.. రూ.350 తగ్గింపు పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ పూర్తి ప్రయోజనాన్ని పొందడం ద్వారా.. రూ.6,600 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీనితో ఈ మొబైల్‌ను కేవలం రూ. 49కి దక్కించుకోవచ్చు.
టెక్నో పాప్ 5
స్టైలిష్ డస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన అసలు ధర రూ.8,999. కాగా ఈ స్పెషల్ సేల్‌లో రూ.6,599కే కొనుగోలు చేయొచ్చు. హెచ్ఎస్బీసీ కార్డ్ ద్వారా చెల్లింపులు జరిపితే 5 శాతం (రూ.330) డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.6,200 వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే రూ.69కే ఈ ఫోన్‌ను కొనొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎం12
శాంసంగ్ గెలాక్సకీ ఎం12 స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,999గా ఉంటే.. అమెజాన్ స్పెషల్ ఆఫర్లో దీని ధరను రూ. 10,499కి తగ్గించింది. దీనికి తోడు హెచ్ఎస్బీసీ కార్డ్‌ను వినియోగించి కొనుగలు చేస్తే మరో 5 శాతం తగ్గింపు పొందొచ్చు. వీటన్నిటింతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.174కే ఈ ఫోన్‌ను కొనొచ్చు.
లావా ఎక్స్2
భారీ బ్యాటరీ, హై క్వాలిటీ డిస్‌ప్లేతో కూడిన లావా ఎక్స్2 స్మార్ట్‌ఫోన్ ధరను రూ.7,999 నుంచి రూ.6,998కి తగ్గించింది. హెచ్ఎస్బీసీ కార్డ్ వినియోగించి ఫోన్ కొనుగోలు చేస్తే రూ.350 తగ్గింపును పొందుతారు.
ఎక్స్ఛేంజ్తో రూ.6,600 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అప్పుడు దీని ధర రూ.48కి తగ్గుతుంది.
నోట్: ఈ ఆఫర్లన్నీ అమెజాన్ వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం చెప్పడం జరిగింది. స్పెషల్ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ అన్నింటిని కలిపిన తర్వాత ఈ ఆఫర్లను వివరించడం జరిగింది. కాబట్టి కొనుగోళ్లు జరిపే ముందు ఆఫర్ వివరాలు మరోసారి తనిఖీ చేసుకోవడం ఉత్తమం.
Also read: Flipkart Sale: iPhone 13 Miniపై ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపు.. ఆఫర్ ఇంకొక్క రోజు మాత్రమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook